Gaami Remuneration విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ ఎంత? గామి కోసం ఎంత తీసుకొన్నారంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా తన ప్రతిభను సత్తాను చాటుకొంటున్నారు. సినిమాల ఎంపిక విషయంలో విభిన్నమైన అభిరుచిని చాటుకొంటున్నారు. యాక్టర్‌గానే కాకుండా దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. తాజాగా ఆయన నటించిన గామి చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ కనబరుస్తున్నది. ఈ సినిమాలో విశ్వక్ పెర్ఫార్మెన్స్‌కు సినీ విమర్శకులు, సాధారణ ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. అయితే విశ్వక్ సేన్ తీసుకొన్న రెమ్యునరేషన్ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

విశ్వక్ సేన్ నటించిన వెళ్లిపోమాకే సినిమా తర్వాత నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఫలక్‌నామా దాస్ సినిమాను రూపొందించారు. ఈ సినిమా హిట్ కావడంతో నటుడిగా మంచి స్థానాన్ని సంపాదించుకొన్నది. ఆ సినిమా సమయంలో వచ్చిన ఆఫర్.. గామి. దాదాపు 6 ఏళ్లపాటు సెట్స్‌పైన ఉంది. ఆర్థిక సమస్యలు, హీరోగా విశ్వక్ సేన్ డేట్స్ సర్దుబాటు కాకపోవడం, అలాగే హై స్టాండర్డ్ టెక్నికల్ అంశాలు సినిమా ఆలస్యం కావడానికి కారణాలుగా పేర్కొంటున్నారు.

Do You Know How much Vishwak Sen takes Remuneration for Gaami Movie

ఫలక్ నామా దాస్ సినిమా హిట్ తర్వాత విశ్వక్ మాత్రం భారీగా రెమ్యునరేషన్ పెంచేశాడు. వరుసగా విజయాలు సాధించడంతో పారితోషికంగా కూడా పెరుగుతూ వచ్చింది. ఇటీవల వచ్చిన సినిమాల కోసం కోట్ల రూపాయల్లో పారితోషికం తీసుకొన్నారు. అయితే గామి సినిమా కోసం ఆయన తీసుకొన్న రెమ్యునరేషన్ చాలా తక్కువ అనే విషయం వెల్లడించారు.

గామి సినిమా తన రెండో, మూడో సినిమా కావడంతో లక్షల్లోనే రెమ్యునరేషన్ తీసుకొన్నాడని తెలిసింది. ఈ సినిమా కోసం ఆయన కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే తీసుకొన్నాడని తెలిసింది. సినిమా లేట్ అవ్వడం.. హీరోగా విశ్వక్ సేన్ రేంజ్ కూడా పెరిగింది. కానీ రెమ్యునరేషన్ పెంచకుండా అదే దానికి ఫిక్స్ అయ్యారనే విషయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ప్రమోషన్స్‌ను తన భుజాల మీద వేసుకొని సినిమాకు బజ్ క్రియేట్ చేయడం విశేషంగా మారింది.

Do You Know How much Vishwak Sen takes Remuneration for Gaami Movie

కొన్నిసార్లు ఓ హీరో సినిమా చేసినప్పటి నుంచి.. పూర్తి చేసే సమయానికి చాలా మార్పులు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో హీరోలు ప్రజెంట్ తీసుకొనే రెమ్యునరేషన్ చెల్లించాలని డిమాండ్ చేస్తుంటారు. కానీ విశ్వక్ సేన్ మాత్రం నిర్మాత శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తన రెమ్యునరేషన్‌కు కట్టుబడి ఉండటం చర్చ జరుగుతున్నది. అయితే గామి సినిమా భారీ లాభాలను ఆర్జిస్తున్న నేపథ్యంలో నిర్మాత హీరోకు రెమ్యునరేషన్ సర్దుబాటు చేస్తారో లేదో చూడాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X