Ram Charan: మూవీ డిజాస్టర్ అయితే.. రామ్ చరణ్ ఏం చేస్తాడో తెలుసా?
విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు, అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు అని చెబుతారు పెద్దలు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఈ పరిస్థితి చాలా విభిన్నంగా ఉంటుంది. సక్సెస్ వస్తే హ్యాపీనే, కానీ డిజాస్టర్ వస్తేనే కోట్ల మంది అభిమానులకు హీరోలు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అలాగే నిర్మాతలకు కోట్లలో నష్టం తప్పదు. మరి ఇలాంటి స్ట్రెస్ ను హీరోలు ఎలా మేనేజ్ చేస్తారు? అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా... ముఖ్యంగా మెగా అభిమానులకు.. దానికి సమాధానమే ఈ ఆర్టికల్. డిజాస్టర్ పడినప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏం చేస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జయాపజయాలు అనేవి సాధారణంగా స్టార్స్ చేతిలో ఉండవు. కొన్నిసార్లు కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు. మరి కొన్నిసార్లు స్టార్ డమ్ ను బట్టి సినిమాలు హిట్ అవుతాయి. ఇంకొన్ని సార్లు అంతా బాగున్నప్పటికీ సినిమా దారుణమైన నెగిటివ్ టాక్ తో డిజాస్టర్ బాట పడుతుంది. మరి ఇంతటి స్ట్రెస్ ను హీరోలు ఎలా మేనేజ్ చేస్తారు అనే డౌట్ చాలామంది మూవీ లవర్స్ కు వచ్చే ఉంటుంది.

అయితే మిగతా హీరోల సంగతేమో గానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇలాంటి స్ట్రెస్ సిచువేషన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు అనే విషయం తాజాగా బయటకు వచ్చింది. రీసెంట్ గా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఒత్తిడిని ఎలా మేనేజ్ చేస్తారు అనే ప్రశ్నకు స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు. సాధారణంగా డిజాస్టర్ పడినప్పటికీ గతంలో తను పార్టీలు ఇస్తానని వెల్లడించారు.
నిజానికి ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలి అనే విషయం తనకు తెలియదని ఒప్పుకున్నారు రామ్ చరణ్. RRR మూవీ సక్సెస్ అయ్యాక ఓ వారం పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదని గుర్తు చేసుకున్నారు. సినిమా సక్సెస్ కావడంతో ఇంట్లోనే ఉండి పూర్తిగా విశ్రాంతి తీసుకున్నానని, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశానని వెల్లడించారు.

అలాగే డిజాస్టర్ల గురించి మాట్లాడుతూ తన సినిమాలు ప్లాప్ తెచ్చుకున్నప్పటికీ గతంలో పార్టీలు నిర్వహిచానని అన్నారు. ఇలా చేయడం వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ గా ఉంచుకోవడానికి సహాయ పడిందని వెల్లడించారు. తను చేసే పని సక్సెస్ అయినా, లేదంటే ఫెయిల్యూర్ అయినప్పటికీ, రిజల్ట్ తో సంబంధం లేకుండా అప్పటిదాకా తాను చేసిన ప్రయాణాన్ని ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చారు చెర్రీ. మరి ఇంకెందుకు ఆలస్యం.. మెగా ఫ్యాన్స్ ఇకపై ఫెయిల్యూర్ ఎదురైనా, లేదంటే నిరాశగా అన్పించినా వెంటనే పార్టీకి రెడీ అయిపోండి. స్ట్రెస్ తగ్గి మరింత జోష్ గా లైఫ్ లో ముందుకు వెళ్లగలుగుతారు.
అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీకి మెగా ప్లాన్ .. రేణుదేశాయ్ ఇచ్చిన ట్విస్ట్ ఏమిటంటే?ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే పొలిటికల్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసింది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ లో రామ్ చరణ్ రాజకీయ వ్యవస్థలోని అవినీతిని తొలగించే ఒక ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా మేకర్స్ అనౌన్స్ చేయలేదు.


Click it and Unblock the Notifications











