Vijayakanth No More: విజయ్‌కాంత్‌ కెప్టెన్ ఎలా అయ్యారు, ఆ పేరు వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసా?

తమిళ స్టార్ సీనియర్ హీరో విజయ కాంత్ గురించి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటన, అంతకు మించిన మంచితనంతో గొప్ప పేరు, ప్రఖ్యాతలు సంపాధించిన ఈయన ఈరోజు ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం 71 ఏళ్ల వయసు కల్గిన ఈయన గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఆస్పత్రులకు కూడా వెళ్లారు. అయితే తాజాగా ఆయనకు కరోనా రావడంతో మరోసారి ఆస్పత్రిలో చేర్చారు. అసలే వయసు మీద పడడం.. అందులోనూ అనారోగ్య సమస్యలు.. వాటికి తోడు కరోనా కూడా జతకట్టడంతో ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

విజయ కాంత్ మృతి విషయం తెలుసుకున్న అనేక మంది ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేధికగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని.. అటు సినీ రంగంతో పాటు ఇటు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. సామాన్య ప్రజలు, ఆయన అభిమానులు అయితే కన్నీరు కారుస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. దాదాపు 30 ఏళ్ల పాటు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన ఈయన.. అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కూడా విపరీతమైన గుర్తింపు పొందాడు.

Recommended Video

Vijayakanth తెలుగు ప్రజలకు ఎంతో స్పెషల్.. ఎందుకంటే? RIP Captain Vijayakanth | Telugu Filmibeat

Do You Know How Vijay Kanth Got the Name Captain Check Details

1952 ఆగస్టు 25వ తేదీన మధురైలో పుట్టిన ఈయన అసలు పేరు విజయ రాజ్ అలగర్ స్వామి. కానీ ఈయన విజయ కాంత్ గా సుపరిచితులు. అయితే ఈయన 1979లో ఇనిక్కుం ఇలామై అనే సినిమాతో తమిళ సినీ రంగంలో కాలు మోపాడు. మొదటి చిత్రంలో విలన్ గా చేసిన ఈయన ఆ తర్వాత అనేక చిత్రాల్లో హీరోగా కనిపించారు. విజయ్ కాంత్ నటించిన అనేక సినిమాలు చాలా వరకు తెలుగులోకి కూడా అనువాదం అయ్యాయి. అవి అద్భుతంగా ఉండడంతో తెలుగు ప్రజలు కూడా ఆదరించారు. ఇలా విజయ కాంత్ తెలుగు ప్రజలకు చాలా దగ్గర అయ్యారు.

ఇదంతా ఇలా ఉండగా.. ఈయనను విజయ కాంత్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా పిలుచుకుంటారు చాలా మంది. అయితే అసలు విజయ కాంత్ కు ఆ పేరు ఎలా వచ్చింది, హీరో, రాజకీయ నాయకుడు అయిన ఈయన కెప్టెన్ ఎలా అయ్యాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ కాంత్ ఎన్నో చిత్రాలు తీయగా.. ఆయన వందో చిత్రం కెప్టెన్ ప్రభాకరన్. 1991లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. వందో సినిమా కావడం, అది కూడా సూపర్ డూపర్ హిట్టు కావడంతో విజయ కాంత్ కు కెప్టెన్ అనే పేరు వచ్చేసింది. సినిమాలోని పేరును ఆయన పేరుగా మార్చేశారు అంతా.

Do You Know How Vijay Kanth Got the Name Captain Check Details

అయితే కెప్టెన్ ప్రభాకరన్ సినిమాతో కెప్టెన్ గా మారిన విజయ్ కాంత్ కు చెందిన ఈ సినిమా తెలుగులోకి కూడా డబ్ అయింది. ఇక్కడ కెప్టెన్ ప్రభాకర్ గా విడుదల చేయగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగు ప్రజలు కూడా ఆయనను కెప్టెన్ అని పిలుచుకోవడం మొదలు పెట్టారు. కేవలం ఈ సినిమా మాత్రమే కాకుండా సిటీ పోలీసు వంటి సినిమా కూడా తెలుగులోకి వచ్చి సూపర్ డూపర్ హిట్టు అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X