Allu Arjun : రూ.100లతో కెరీర్ స్టార్ట్ చేసిన బన్నీ... ఇప్పుడు పుష్ప 2 కోసం ఎన్ని కోట్లో తెలుసా?
యూత్‌కేమో స్టైలిష్ ఐకాన్, అమ్మాయిలకేమో ప్రేమను పంచే ఆర్య.. ఆయనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మొదట తన సినిమాల్లో డీజేలు పగిలిపోయే రేంజ్లో స్టెప్‌లు వేసి ఆకట్టుకున్న ఆయన ఆ తర్వాత నటనలోనూ సినిమా సినిమాకు వైవిధ్యం చూపించి ఐకాన్ స్టార్‌గా ఎదిగారు. మాస్, క్లాస్, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్.. ఇలా అందరినీ మెప్పించి పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకునే హీరోల్లో ఒకరిగా ఎదిగారు. ఈ నేపథ్యంలో ఆయన తొలి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? ఇప్పుడెంత తీసుకుంటున్నారు? వంటి విశేషాలను తెలుసుకుందాం..
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోల్లో ముందు వరుసలో ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా, మామయ్య చిరంజీవికి మేనల్లుడిగా మెగా ఫ్యామిలీ ట్యాగ్‌లైన్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తన స్టైలిష్ యాటిట్యూడ్ యాక్టింగ్‌తో తనకుంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు. బ్రాండ్ అంటే ఇది సార్ అనే రేంజ్లో క్రేజ్‌ను దక్కించుకున్నారు.

హీరోగా తొలి అవకాశం ఇలా : మెగాస్టార్ చిరంజీవి ప్రతీ పుట్టినరోజుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంటారు. అలా ఓ సారి చిరు బర్త్ డే వేడుకలో చిందులేసిన బన్నీని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గుర్తించారు. ఆ సమయంలోనే బన్నీ తల్లి నిర్మలకు రూ.100 రూపాయలు ఇచ్చి అల్లు అర్జున్ను హీరోను చేస్తానని మాట ఇచ్చారట. చెప్పినట్టుగానే గంగోత్రి చిత్రం ద్వారా బన్నీని హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ చిత్రానికి గానూ బన్నీకి రూ.4లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు కథనాలు ఉన్నాయి.
అయితే హీరోగా పరిచయం కాకముందే బన్నీ చిరంజీవి డాడీ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు. చిరు దగ్గర డ్యాన్స్ స్టూడెంట్‌గా ఓ కుర్రాడి పాత్రలో సందడి చేశారు. కొన్ని కథనాల ప్రకారం ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రాఘవేంద్రరావు బన్నీ డ్యాన్స్‌కు మెచ్చి రూ.100 ఇచ్చారని కూడా అంటుంటారు. అంతకన్నా ముందు చిన్నవయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిరంజీవి విజేత, కమల్ హాసన్ స్వాతిముత్యం చిత్రంలోనూ నటించారు బన్నీ.

ఆ తర్వాత రెండో సినిమా ఆర్యతోనే వైవిధ్యం ప్రదర్శించిన అల్లు అర్జున్ కెరీర్లో బన్ని, హ్యాపీ, దేశముదురు, జులాయి, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం, సన్నాఫ్ సత్యమూర్తి, వేదం, రుద్రమదేవి, అల వైకుంఠపురములో వంటి పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. తన యాక్టింగ్‌తో ముఖ్యంగా మలయాళంలోనూ మల్లు అర్జున్గానూ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక పుష్ప ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆయన కేవలం తెలుగు, మలయాళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు.
తొలి భాగం గ్రాండ్ హిట్‌తో పుష్ప 2ను కూడా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. రూ.దాదాపు 500కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని కోసం బన్నీ సుమారు రూ.120 కోట్లు అందుకోబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత రెమ్యునరేషనే లేదని, లాభాల్లో వాటా దక్కబోతోందని ఈ మధ్య ప్రచారం సాగింది. లాభాల్లో 33 శాతం అని ఆ మధ్య అన్నారు. అంటే ఈ చిత్రానికి దాదాపు రూ.1000కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే బన్నీ గట్టిగానే రెమ్యునరేషన్ అందుతుందని అర్థమవుతోంది. ఏది ఏమైనా రూ.100 స్థాయి నుంచి వందల కోట్లు అందుకునే రేంజ్‌కు అల్లుఅర్జున్ ఎదిగారు.


Click it and Unblock the Notifications











