బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పేసిన ఎన్టీఆర్.. యంగ్ టైగర్ అకౌంట్‌లో అంతే ఉందా?

నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. తన అద్భుతమైన నటనతో వరుస హిట్స్ కొట్టి స్టార్ హీరోగా దూసుకెళ్తున్నారు. నవరసాలను అద్భుతంగా పలికించగల నటుడు.. ఏ సీన్ ను అయినా.. సింగిల్ టేక్‌లో ఓకే చేయగల టాలెంటెడ్ యాక్టర్ తారక్. ఆర్ ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ఎదిగారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవరతో మరోసారి ఎన్టీఆర్ పేరు మారుమోగుతోంది. ఇదిలాఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. తన బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పిన వీడియో వైరలవుతోంది.

నందమూరి నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన తన తాతయ్య నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వద్ద నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. తొలుత బాలరామాయణం మూవీ ద్వారా ఎన్టీఆర్ బాలనటుడుగా పరిచయమాయ్యాడు. ఆ తరువాత 'నిన్ను చూడాలని' అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ వెంటనే స్టూడెంట్ నెం.1, సింహాద్రి, ఆది సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ సాధించి.. అతి చిన్న ఏజ్ లో స్టార్ డమ్ అందుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్.

Do you know Jr NTR s bank balance Junior NTR Hilarious Comedy Video Viral

అయితే.. ఈ ఫామ్ ను కొనసాగించలేకపోయారు జూనియర్ ఎన్టీఆర్. మధ్యలో పలు సినిమాలు డిజాస్టర్ గా మారాయి. ఆయన స్టార్ ఫేమ్ కాస్త తగ్గింది.ఆ సమయంలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగతో తిరిగి ఫామ్ లోకి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఆ తరువాత అదుర్స్, బృందావనం మూవీలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. ఆ తరువాత వచ్చిన టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల్లో తన లూక్ ను పూర్తిగా మార్చేవేశారు. జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత సినిమాలతో జూఎన్టీఆర్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా నిలిచారు.

సక్సెస్ పుల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో జూ. ఎన్టీఆర్.. పాన్ ఇండియా హీరోగా మారారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవరతో మరోసారి ఎన్టీఆర్ పేరు మారుమోగుతోంది. అలాగే.. ఆయన ఎన్నో బ్రాండ్స్ కు అంబాసిటర్ వ్యవహరిస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్.కానీ, ఓ టీవీ షోలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ తన బ్యాంక్ చెప్పి.. అందర్ని ఆశ్చర్యపరిచారు.

ఒక గేమ్ షో లో గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ సమయంలో ఆ షోలోని కంటెస్టెంట్లు.. తమ వండిన పుడ్ ను టేస్ట్ చేయమని కోరుతారు. ఆ ఫుడ్ ను టేస్ట్ చేయాలో.. వద్దనాలో తెలియని క్లిష్ట పరిస్థితిలో ఎన్టీఆర్ కెమెరా ముందుకు వచ్చి.. 'వాళ్లు ఇది ఏంటో తినమంటున్నారు. బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ రెండు రూపాయల 30 పైసలు ఉంది ' అంటూ చెప్పుకొచ్చారు.

పుడ్ తిన్న తర్వాత.. 'ఎవరక్కడ నా ఏనుగును ఇక్కడకు తీసుకురండి. ఆయనకు మీద ఎక్కి రిక్షాలో.. టిప్పు సుల్తాన్ తో యుద్ధానికి వెళ్లాలి. నా కొడుకు ఔరంగజేబు, నా కూతురు రాణి రుద్రమదేవి ఎక్కడ ఉన్నారు. బహుశా రింగా రింగా రోజెస్ అంటూ ఆడుకోవడానికి వెళ్లి ఉంటారు" అంటూ నవ్వుల పువ్వులు పూయించాడు. ఓ సినిమాలోని కామెడీ సీన్ ను తనదైన శైలిలో రీ క్రియేట్ చేసి కామెడీని ఇరగదీశారు జూనియర్ ఎన్టీఆర్.

More from Filmibeat

Read more about: jr ntr tollwood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X