Jr.NTR: 4లక్షలతో కెరియర్ స్టార్ చేసిన జూ.ఎన్టీఆర్... 'దేవర' కోసం ఎన్ని కోట్లు ఛార్జ్ చేశాడో తెలుసా?

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పేరు మాత్రమే కాదు. ఓ బ్రాండ్‌. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ కుటుంబంలో ఎవరు అందుకోలేని గ్లోబల్ వైడ్​ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన 13ఏళ్ల వయసులో 'బాల రామాయణం'లో బాల రాముడిగా అద్భుతంగా నటించి తొలిసారి నంది అవార్డును సొంతం చేసుకున్నారు.

ఇప్పుడు ప్రపంచంలోని గొప్ప నటుల్లో ఒకరిగా ఎదిగి కోట్లు అందుకునే స్థాయిని సంపాదించుకున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్​ దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తొలి రెమ్యునరేషన్​ ఎంత, ఇప్పుడు ఎంత ఛార్జ్​ చేస్తున్నారు? సహా పలు విషయాలను తెలుసుకుందాం..

Do you know Jr. NTRs remuneration for Koratala Siva Devara movie?

2001లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్​లో 'నిన్నుచూడాలని' చిత్రంతో హీరోగా సిల్వర్​ స్క్రీన్​కు పరిచయమయ్యారు తారక్​. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'స్టూడెంట్ నెం.1'తో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోయింది. అనంతరం ఆదితో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇక అంతే అప్పుడు నుంచి ఆయన స్టార్ హీరోగా మారిపోయారు.

అనంతరం సింహాద్రి, రాఖీ, యమదొంగ, అదుర్స్, బృందావనం సహా రీసెంట్​ ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ హిట్లను అందుకున్నారు. అయితే ఒకానొక సమయంలో వరుస ఫ్లాపులు ఖాతాలో పడిన వెనకడుగు వేయలేదు. శక్తి, ఊసరవళ్లి, దమ్ము, బాద్​షా, రామయ్యా వస్తావ్యా, రభస వంటి డిజాస్టర్లుగా కూడా నిలిచాయి.

యాక్టింగ్, డైలాగ్, డాన్స్ : సీనియర్‌ ఎన్టీఆర్‌ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం.. ఇలా నవరసాలను అలవోకగా పండించగలిగే నటుల్లో ఎన్టీఆర్ ముందుంటారు. ఆయన చూసిన వారు ఎవరైనా సరే 'నటనలో నీ తర్వాతే ఎవరైనా' అని అంటుంటారు.

Do you know Jr. NTRs remuneration for Koratala Siva Devara movie?

సింగిల్‌ టేక్‌లోనే క్క తిప్పుకోకుండా భారీ సంభాషణలు చెప్పడం, అదిరిపోయే రేంజ్​లో స్టెప్పులు వేయడం ఆయనకే సాటి. ఆయన జోష్​కు, ఫైట్స్​కు సిల్వర్​స్క్రీన్​ ఊగిపోవాల్సిందే. , సింగర్‌గానూ రాణించారు. అప్పుడప్పుడు చిత్రాల్లో పాటలు కూడా పాడారు. మొత్తంగా ఇలా అన్నింటిలోనూ మేటి అనిపించుకున్నాడు.

రెమ్యునరేషన్​ : అయితే ప్రస్తుతం ఒక్కో సినిమా కోసం సుమారు రూ. 50 నుంచి రూ.60 కోట్ల వరకు రెమ్యునరేషన్​ను తారక్​ తీసుకుంటున్నారట. ప్రస్తుతం దేవరకు రూ.60 కోట్ల వరకు ఛార్జ్ చేశారని తెలిసింది. అయితే తారక్‌ అందుకున్న మొదటి రెమ్యునరేషన్‌ నాలుగు లక్షల రూపాయలని తెలిసింది. అప్పుడు అంత మొత్తంలో డబ్బు చూసి తనకు ఏం చేయాలో తెలియక చాలా రోజుల వరకు ఆ డబ్బును లెక్క పెడుతూ కూర్చున్నారట. ఇప్పుడేమో కోట్లకు పైగా రెమ్యునరేషన్​ను అందుకుంటూ గ్లోబల్​ వైడ్ స్టార్​డమ్​ను అనుభవిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X