Kamal Haasan Net Worth : ఇండియన్ 2 తర్వాత కమల్ హాసన్ ఆస్తులు ఎంత? ఎన్ని కోట్ల విలువైన సంపద అంటే?

భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఒకరు. నటనకే కొత్త భాష్యం చెప్పిన ఈ విలక్షణ నటుడు.. దర్శకుడిగా, నిర్మాతగా, రైటర్‌గా భారతీయ చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. దాదాపు ఆరు దశాబ్ధాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ లోకనాయకుడి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కమల్ హాసన్ గురించిన ఆసక్తికర విషయాలు, ఆయన రెమ్యునరేషన్, సంపద తదితర అంశాలు మీకోసం .

1954 నవంబర్ 7న అప్పటి మద్రాస్ రాష్ట్రంలోని పరమకుడిలో తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు కమల్ హాసన్. ఆయన అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్. తండ్రి శ్రీనివాసనన్ లాయర్, స్వాతంత్య్ర సమరయోధుడు, తల్లి రాజ్యలక్ష్మీ. తర్వాతి కాలంలో పార్థసారథి పేరును మార్చి కొడుక్కి కమల్ హాసన్ అని నామకరణం చేశారు శ్రీనివాసన్. కమల్‌కు ఇద్దరు సోదరులు చారుహాసన్, చంద్రహాసన్, సోదరి నళిని ఉన్నారు. ఆరేళ్ల వయసులో 1960లో కలతూర్ కన్నమ్మ సినిమా ద్వారా కమల్ హాసన్ సినీ రంగ ప్రవేశం చేశారు. ఇందులో మహానటి సావిత్రికి కొడుకుగా ఆయన నటించడం విశేషం. తొలి సినిమాతోనే రాష్ట్రపతి అవార్డ్‌ని అందుకున్నారు.

do you know kamal hassan net worth after Indian 2 Result his investments assets remuneration and upcoming movies details

1974లో కన్యాకుమారి అనే మలయాళ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు కమల్ హాసన్. భాషా భేదం లేకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ సినిమాల్లో నటిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక 1980ల నుంచి కమల్ హాసన్ శకం ప్రారంభమైంది. ఇది కాదు, ఆకలి రాజ్యం, సాగర సంగమం, స్వాతి ముత్యం, విచిత్ర సోదరులు, పుష్పక విమానం, ఇంద్రుడు చంద్రుడు, శుభ సంకల్పం, భారతీయుడు, దశావతరం, విశ్వరూపం వంటి సినిమాలు కమల్ నటననకు మచ్చు తునకలు .

కమల్ హాసన్ పని అయిపోయింది అంటున్న దశలో విక్రమ్‌తో ఆయన సాలీడ్ కంబ్యాక్ ఇచ్చారు. ఈ వెంటనే భారతీయుడు 2, కల్కి 2898 ఏడీ సినిమాలతో ఆయన అలరించారు. ప్రస్తుతం కల్కి 2, ఇండియన్ 3, థగ్ లైఫ్, విక్రమ్ 2, హెచ్ 233 ప్రాజెక్ట్స్‌ లైన్‌లో ఉన్నాయి. ఆరు దశాబ్ధాల కెరీర్‌‌లో 230కి సినిమాల్లో నటించిన కమల్ హాసన్‌కు ఎన్నో జాతీయ , అంతర్జాతీయ అవార్డులు వరించాయి. తనను ఇంతటి వాడిని చేసిన ప్రజలకు సేవ చేయలేనే ఉద్దేశంతో రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు.

do you know kamal hassan net worth after Indian 2 Result his investments assets remuneration and upcoming movies details

ఇన్నేళ్ల కెరీర్‌లో కమల్ హాసన్ ఎంత సంపాదించారనేది ఆసక్తికరం. ఈ వివరాలు చూస్తే .. ఆయన సంపద విలువ 70 మిలియన్ డాలర్లు (రూ. 450 కోట్లు)గా అంచనా. భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకరైన కమల్‌ ప్రస్తుతం సినిమాకు రూ. 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లుగా సమాచారం. చెన్నైలో రూ.130 కోట్లకు పైగా విలువైన మ్యాన్షన్.. యూకేలో రూ.200 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని కోలీవుడ్ టాక్. కార్లంటే ఇష్టపడే కమల్ హాసన్‌కు బీఎండబ్ల్యూ 730 ఎల్‌డీ, లెక్సస్ ఎల్‌ఎక్స్ 570, టొయోటా ప్రాడో , మిత్సుబిషి పాజెరో , మెర్సిడెస్ బెంజ్ ఏ 220 , హమ్మర్ హెచ్3 , రేంజ్ రోవర్ ఎవాక్యూ , ఆడి ఎ8 ఎల్ వంటి కార్లు ఆయన క్యారేజ్‌లో ఉన్నాయి. కమల్ హాసన్ జీవితంలో మరిన్ని విజయాలు అందుకున్ని, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తోంది ఫిల్మీబీట్.

More from Filmibeat

Read more about: kamal haasan movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X