మహేష్ బాబు వదిలేశాడు.. ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఆ మూవీ ఏంటో తెలుసా?
సినిమా పరిశ్రమలో అవకాశాలు అరుదుగా ఆర్టిస్టుల తలుపు తడుతుంటాయి. వాటిని గ్రహించి అందుకొన్న వాళ్లు స్టార్ హీరోలు అవుతారు. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని స్పెషల్ ఆఫర్లను అందుకోలేని పరిస్థితి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకరి చేజారిన అవకాశం మరోకరి బంపర్ సక్సెస్‌గా మారిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అలాంటి అవకాశాన్ని వదులుకొన్న మహేష్.. ప్రభాస్‌కు భారీ హిట్ అందించాడు. దాంతో అక్కడి నుంచి యంగ్ రెబల్ స్టార్ కెరీర్ గ్రాఫే మారిపోయింది. ఈ సినిమా ఏంటి? మహేష్ వదులుకొన్న సినిమా ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా రంగంలో భారీ విజయాలు అందుకొన్న సినిమాల్లో వర్షం మూవీ ఒకటి. ఈ సినిమా కథను మహేష్ బాబును దృష్టిలో పెట్టుకొని దర్శకుడు శోభన్ కథ రాయగా నిర్మాత ఎంఎస్ రాజు ఈ కథను యంగ్ సూపర్ స్టార్‌కు వినిపించాడు. ఈ సినిమా కథ విన్న తర్వాత ఆయన తనకు ఈ స్టోరీ సూట్ కాదు. అయినా నేను ఈ సినిమా ప్రస్తుతం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అని సన్నితంగా రిజెక్ట్ చేశాడు. దాంతో ఈ సినిమా ప్రభాస్‌ను ఆకట్టుకోవడం, వెంటనే ఈ స్టోరీని వర్షం సినిమాగా తెరకెక్కించారు.

సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు నిర్మాతగా శోభన్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలుపెట్టారు. ప్రభాస్, త్రిషా కృష్ణన్ హీరో హీరోయిన్లుగా, గోపిచంద్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు మూవీ రిలీజ్ కంటే ముందే సూపర్ హిట్లుగా నిలిచాయి. అలాంటి క్రేజ్‌లో ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఈ సినిమా తొలి ఆట నుంచి హిట్ టాక్ సొంతం చేసుకొన్నది.
ట్రాయంగిల్ లవ్ స్టోరీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొంది వర్షం సినిమాను సుమారుగా 10 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ సినిమా 125 కేంద్రాలకు పైగా 50 రోజులు ఆడింది. ఈ సినిమా పలు సెంటర్లలో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో 22 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. నిర్మాతకు, డిస్టిబ్యూటర్లకు తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలను పంచి పెట్టింది.
తన కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి సరైన హిట్ లేకుండా ప్రభాస్ కష్టాల్లో ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ సమయంలో శంకర్ దాదా ఎంబీబీఎస్, బాలకృష్ణ, నాగార్జున సినిమాలు రిలీజ్ అయి ఉన్నాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్రభాస్ వెనుకాడారు. ఈ విషయాన్ని స్వయంగా అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణకు ప్రభాస్ చెప్పడం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రభాస్‌కు తొలి సూపర్ హిట్ అందించింది. అప్పటి నుంచి ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ రివ్వును ఎగిసిపడింది.
అయితే మహేష్ బిజీగా ఉన్న కారణంగా వర్షం సినిమాను వదులుకొన్నాడు. అయితే దానిని ప్రభాస్ అందుకొని తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొన్నాడు. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్స్‌గా మారారు. బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కొల్లగొడుతున్నారు. ఇలా ఇద్దరు హీరోలు స్టార్‌లుగా రాణించడం విశేషంగానే చెప్పుకోవాి.


Click it and Unblock the Notifications











