మహేష్ బాబు మరో ఫారిన్ ట్రిప్... సూపర్ స్టార్ పట్టుకొన్న బ్యాగ్ ఖరీదు ఎన్ని లక్షలో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీ లేట్ అవుతున్నా ఎలాంటి టెన్షన్ లేకుండా బాధ్యతనంతా రాజమౌళిపై వదిలేసి, తన మేకోవర్, ట్రైనింగ్ తో పాటు పర్సనల్ విషయాలపై దృష్టి పెడుతున్నారు. తాజాగా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి బయలుదేరిన విషయం తెలిసిందే. జూన్ 14న ఆయన ఎయిర్ పోర్టులో ఫ్యామిలీతో కలిసి కనిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అన్నింటికంటే మహేష్ బాబు వేసుకున్న బ్యాక్ ప్యాక్ ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఆ బ్యాక్ ప్యాక్ ధర ఎంతో తెలుసుకుందాం పదండి.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో హైదరాబాద్ విమానాశ్రయంలో మహేష్ బాబుతో పాటు ఆయన భార్య నమ్రత శిరోద్కర్, కుమార్తె సితారా, కుమారుడు గౌతమ్ కనిపిస్తున్నారు. మహేష్ బాబు పొడవాటి జుట్టు, గడ్డంతో.. నలుపు రంగు ట్రాక్ ప్యాంట్, బ్రౌన్ కోట్, డార్క్ షేడ తో ఉన్న టోపీని ధరించి తన లుక్ ను కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే విమానాశ్రయంలో ఆయన ఒక బ్లూ కలర్ బ్యాక్ ప్యాక్ వేసుకొని కనిపించారు.

సూపర్ స్టార్ అభిమానుల దృష్టి అంతా దానిపైనే పడింది. దీంతో ఆ బ్యాగ్ ధర ఎంత? ఏ బ్రాండ్ కి సంబంధించిన బ్యాగ్? అనే విషయాలను ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజెన్లు. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు తన వెంట తీసుకెళ్లిన విలాసవంతమైన బ్యాగ్ లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ ఎంఎం బ్రాండ్ కు చెందినది. దీని ధర 3.92 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.
ఇక వైరల్ అవుతున్న ఫోటోలో సితార, గౌతమ్ కలిసి మాట్లాడుకుంటూ కనిపించారు. గౌతమ్ గ్రే కలర్ ప్యాంట్, లేత నీలం రంగు టీ షర్ట్ ధరించగా, సితార తెల్లటి టీషర్ట్ అండ్ ట్రాక్ ప్యాంట్ ధరించి కనిపించింది. మరోవైపున నమ్రతా శిరోద్కర్ లైట్ బ్లూ కలర్ కోటులో క్యాజువల్ లుక్ లో కనిపించింది. సితార తమ ఫ్యామిలీ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే ఇటీవల గౌతమ్ తన ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ యూనివర్సిటీలో చేరాడు. దీనికోసమే మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. సినిమా స్టార్ట్ కావడానికంటే ముందే మహేష్ బాబుతో కలిసి చిత్ర బృందం అంతా దేశ విదేశాల్లో టూర్లు వేస్తున్నారు. ఇక మహేష్ బాబు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతూ విదేశాల్లో శిక్షణ కూడా తీసుకుంటున్నారు. అయితే ఇప్పటిదాకా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాకపోవడం గమనార్హం. రాజమౌళి కూడా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మరి ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











