ఆ హీరోయిన్‌కు నేను ఫ్యాన్.. ఆమెతోనే ఫ్రెండ్‌షిప్ చేయాలని.. మహేష్ మనసులో మాటతో ఫ్యాన్స్ ఫిదా!
సూపర్ స్టార్ మహేష్ బాబుకు కోట్లాది మంది అభిమానులు ఉన్న విషయం అందరికి తెలిసిందే. మహేష్ సినిమా వచ్చిందంటే దానికంటే పెద్ద పండుగ ఉండదు. అలాంటి హీరో కూడా అభిమానించే నటులు ఉండటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తాజాగా గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్‌లో మహేష్ బాబు తనకు ఇష్టమైన హీరోయిన్ గురించి చెప్పుకొచ్చారు. ఇంతకు మహేష్‌కు నచ్చిన హీరోయిన్ ఎవరంటే..
గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరీతోపాటు ప్రకాశ్ రాజ్, రావు రమేష్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. అయితే రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటించింది. తనకు తల్లిపాత్రలో నటించిన ఆమె గురించి మహేష్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆయన ఆమె గురించి మాట్లాడుతూ..

గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ గారితో నటించడం గొప్ప అనుభూతి. ఆమెకు నేను పెద్ద ఫ్యాన్‌ను. బాహుబలి సినిమా తర్వాత నేను అభిమానిగా మారిపోయాను. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆమె పోషించిన శివగామి పాత్ర ఐకానిక్. ఇప్పటి వరకు అలా యాక్టింగ్ చేసిన వారు నా దృష్టిలో ఎవరు లేరు అని మహేష్ బాబు అన్నారు.
రమ్యకృష్ణ టాలెంట్‌ను చూసి నేను ఫిదా అయ్యాను. ఆమెకు ఒక సీన్ వివరిస్తే.. కేవలం ఓ కంటిచూపుతో తన ఎక్స్‌ప్రెషన్ చెప్పేస్తుంది. అదే ఆమె గ్రేట్ నెస్. కేవలం కళ్లతోనే యాక్టింగ్ చేస్తేస్తుంది. ఆమెతో చేసిన సీన్లు బ్రిల్లియెంట్. సీన్‌లో డైలాగ్స్ లేకపోయినా.. ఆ సీన్‌ను అర్ధం చేసుకొని ఎక్స్‌ప్రెషన్ ఇచ్చేస్తారు. ఓ ఎమోషన్ పండిస్తారు అని మహేష్ బాబు అన్నారు.

నా సినిమాలో చేసిన క్యారెక్టర్లతో ఫ్రెండ్ షిప్ చేయాలంటే.. గుంటూరు కారం సినిమాలో రమ్య చేసిన క్యారెక్టర్‌తోనే ఫ్రెండ్‌షిప్ చేయాలనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ ఎప్పుడూ కలువలేదు. క్లైమాక్స్‌లోనే నాకు కలిసింది. అలాంటి క్యారెక్టర్‌తోనే నాకు ఫ్రెండ్‌షిప్ చేయాలనేంత గొప్పగా క్యారెక్టర్ ఉంది అని మహేష్ బాబు అన్నారు.

ఇదిలా ఉండగా, గుంటూరు కారం చిత్రం నెగిటివ్ ట్రెండ్స్, మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమా ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద బలంగా ఉంది. డిజాస్టర్ టాక్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వరకు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది.


Click it and Unblock the Notifications











