Chiranjeevi 1116 రూపాయలతో కెరియర్ స్టార్ట్ చేసిన చిరంజీవి.. విశ్వంభర సినిమా కోసం ఎంత ఛార్జ్ చేశారో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. ఎందుకుంటే స్వయంకృషితో ఎదిగిన నటుడాయన. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు దీటుగా ఇంకా సినిమాలు చేస్తున్నారు.
అలాగే సీనియర్ హీరోల్లోనూ ఏ కథానాయకుడికి లేని మార్కెట్ ఆయనకు ఇప్పటికీ ఉంది. ఇప్పుడాయన విశ్వంభర అనే భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. అయితే ఆయన తన కెరీర్‌ను వెయ్యి రూపాయల రెమ్యునరేషన్‌తో మొదలుపెట్టి ప్రస్తుతం కోట్ల రూపాయలను అందుకునే స్థాయికి ఎదిగారు. ఈ నేపథ్యంలో చిరు ఇప్పుడు లేటెస్ట్ మూవీ విశ్వంభర కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసుకుందాం..

తన స్వయంకృషి ఎదుగుదలతో ఎందరిలోనో స్ఫూర్తిని నింపిన హీరో మెగాస్టార్ చిరంజీవి. తన యాక్షన్, డ్యాన్స్‌లతో ఇండస్ట్రీలో ఓ సరికొత్త ట్రెండ్ సృష్టించారు. కామెడీ, ఎమోషన్.. ఇలా నవరసాలన్నింటిని పలికించడంలో ఆయనో మాస్టర్. ప్రతి ఛాలెంజ్‌ను స్వీకరించి విజేతగా నిలిచారాయన. తన చిత్రాలతో బాక్సాఫీసు వసూళ్ల వేటలో మగ మహారాజుగా నిలిచారు.
అలా పరిచయం.. అయితే చదువుకున్న రోజుల్లోనే నటనపై ఆసక్తి పెంచుకున్న చిరు.. కాలేజీ అయిపోయాక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి నటన నేర్చుకున్నారు. ఆ తర్వాత ఎందరో హేమా హేమీల్లాంటి నటులున్న టాలీవుడ్లోకి శివ శంకర వరప్రసాద్‌గా(చిరంజీవి అసలు పేరు) ఎంట్రీ ఇచ్చారు. 1978లో పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి కెరీర్ ప్రారంభించారు. కానీ ఆ తర్వాత నటించిన ప్రాణం ఖరీదు చిత్రం ముందుగా థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాతోనే మెగాస్టార్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

హీరోగా తొలి రెమ్యునరేషన్.. అయితే ఈ రెండు సినిమాల(ప్రాణం ఖరీదు, పునాదీ రాళ్లు) కోసం మెగాస్టార్ డబ్బులు తీసుకోలేదట. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. అలా తన 3వ చిత్రంగా మన వూరి పాండవులు సినిమా చేశారు. దీనికి గానూ రూ.1116 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారట. హీరోగా చిరుకు ఇదే తొలి జీతం.
తొలి భారతీయ నటుడిగా.. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు. ఈ క్రమంలోనే హీరోగానూ అవకాశాలను అందుకుని తాననుకున్న గమ్యాన్ని చేరి ఎందరిలోనో స్ఫూర్తినింపారు. సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ పోయారు. అలానే రెమ్యునరేషన్‌ను కూడా భారీగానే అందుకున్నారు. అలా అత్యధిక పారితోషికం (రూ.కోటికిపైగా) అందుకున్న తొలి భారతీయ నటుడిగా 1992లో వార్తల్లోనూ నిలిచారు.

విశ్వంభర కోసం ఎన్ని కోట్లంటే... ప్రస్తుతం చిరు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ జోరు చూపిస్తున్నారు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. అయితే గతేడాది వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత భోళాశంకర్‌తో డిజాస్టర్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆచిచూతి సోషియో ఫాంటసీ విశ్వంభర చిత్రాన్ని సెలెక్ట్ చేశారు.
ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సందడి చేయనుంది. 2025 జనవరి 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతం చిరు రూ.40కోట్ల వరకు అందుకుంటున్నారని తెలిసింది. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ కన్నా ఎక్కువగా తీసుకుంటున్నారు.
ఇకపోతే సోషియో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రెడీ అవుతున్న ఈ మూవీ కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











