Pawan Kalyan: ఎన్నికల తర్వాతే షూటింగ్‌కు పవన్ కల్యాణ్.. ఏ మూవీ చేస్తాడో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కల్యామ్... ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఈయన పేరు వింటే చాలు అభిమానులు అంతా పూనకాలతో ఊగిపోతుంటారు. ఇక ఈయన కనిపించాడంటే రచ్చ రచ్చే. థియేటర్లలో కనపించినా అదే సందడి. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కల్యాణ్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. అటు సినీ అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో అడుగులు వేస్తున్నారు.

ఇఖ ఏపీ ఎన్నికల దగ్గరపడుతున్నా కొద్ది ఎక్కువగా రాజకీయాల మీదే ఫోకస్ చేశారు. దీంతో ఆయన చాలా సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఎన్నికల తర్వాత ఆయన ఏ సినిమాను ముందుగా పట్టాలెక్కిస్తారు.. ఏది ముందుగా పూర్తి చేస్తారనే దానిపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే ఈయన ముందుగా ఓ మూవీని పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఆ సినిమా ఏంటో, ఎప్పుడు విడుదల కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Do you Know Pawan Kalyan do Which Movie First After Elections Check Details

ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత పలు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండనున్నారు. ముఖ్యంగా ఆయన ఓజీ సినిమా పూర్తి చేస్తారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌ మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తుండగా... ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి, అమ్రాన్ హష్మీ, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి ఎంతో మంది నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా ఇటీవలే ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.

Do you Know Pawan Kalyan do Which Movie First After Elections Check Details

కేవల నాలుగు వారాల పాటు పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటే సినిమా పూర్తి అవుతుందని ... అందుకే ఈ చిత్రాన్ని ముందుగా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే విడుదల తేదీ అధికారికంగా ప్రకటించడం, దీన్ని త్వరగా పూర్తి చేస్తే ఓ పని అయిపోతుందని అనుకోవడంతో దీన్నే ముందుగా పూర్తి చేయాలని చూస్తున్నారట. ఎన్నికలు కాగానే అంటే జూన్, జూలై నెలలో పవన్ డేట్స్ ఇస్తాడనే ఆశాభావంతో ఓజీ మేకర్స్ భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X