ఖుషీ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ వదిలేసుకొన్న క్రేజీ లవ్ స్టోరీ ఎంటో తెలుసా?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మాంచి మాస్ క్రేజ్ ఉన్నటువంటి అతి తక్కువమంది స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ మార్కెట్ గాని తెలుగు రాష్ట్రాల్లో మరో హీరోకి డ్రీం అన్న రేంజ్ లో పవన్ తన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. కాగా ఇపుడు పవన్ కళ్యాణ్ సినిమాలోనే కాకుండా రాజకీయాలు పరంగా కూడా రాణిస్తుండగా పవన్ ఇప్పుడు చేయనున్న సినిమాల కోసం అభిమానులు మంచి ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.

అయితే తెలుగు సినిమాలో పవన్ కళ్యాణ్ కి మరో ప్రత్యేకత కూడా ఉంది. సినిమా కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లోనే వరుసగా 7 హిట్స్ కొట్టిన హీరోగా పవన్ కళ్యాణ్ కి ఒక క్రేజీ రికార్డు ఇండస్ట్రీలో ఉండగా ఈ 7 సినిమాల్లో తన ఇండస్ట్రీ హిట్ "ఖుషి" కూడా ఒకటి. దర్శకుడు ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్ తో చేసిన ఈ చిత్రం యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలు రూల్ చేస్తున్న సమయంలో క్లీన్ లవర్ స్టోరీగా వచ్చి భారీ హిట్ అయ్యింది.

do you know pawan kalyan rejected a love story movie after Khushi blockbuster with SJ Surya

అయితే ఆ తర్వాత నుంచి పవన్ కి వరుస ప్లాప్ లు వచ్చిన సంగతి అందరికీ తెలుసు. అయితే పవన్ అప్పట్లో చూసిన పీక్ స్టార్డం అంతా ఇంతా కాదు. ఆ సమయంలోనే పవన్ చాలా సినిమాలు కథలు విని వదిలేస్తే వాటిని మరో హీరోలు చేసి భారీ హిట్స్ కొట్టి తమ కెరీర్ ని అద్భుతంగా మలుచుకున్నారు. అవి కానీ పవన్ కి పడుంటే ఇప్పుడు పవన్ కెరీర్ కూడా మరోలా ఉండేది అని పవన్ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు.

అయితే ఇపుడు వరకు పవన్ టాలీవుడ్ లో వదిలేసిన సినిమాలు లిస్ట్ కోసం చాలా మందికే తెలిసి ఉండొచ్చు. పోకిరి, ఇడియట్, సత్యాగ్రహి, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇలా చాలా సినిమాలు కోసం ఎప్పుడు నుంచో చాలా మందికి తెలుసు కానీ పవన్ ఆ సమయంలోనే ఓ అద్భుతమైన ప్రేమ కథను కూడా వదిలేసాడని ఇపుడు కొత్తగా బయటకి వచ్చింది.

పైగా ఈ సినిమా ఎవరితోనో కూడా కాదు పవన్ తో ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడు ఎస్ జే సూర్య తోనే అట. పవన్ కోసం ఖుషి తర్వాత మరో ప్రేమ కథని సూర్య రెడీ చేసి తీసుకెళ్ళడట. పవన్ కి అది నచ్చింది కూడా.. కానీ కొన్ని కారణాలు రీత్యా రెండేళ్లు గ్యాప్ ఇద్దరికీ రావడంతో మరోసారి పవన్ ని ఎస్ జే సూర్య కలిసి సినిమా చేద్దాం అని అడిగాడట.

కానీ పవన్ అప్పుడు ఆ సినిమా మీద అప్పుడు ఉన్న పరిస్థితులు రీత్యా నో అన్నాడట. ఆ సమయంలో కానీ పవన్ సినిమా చేసి ఉంటే పెద్ద హిట్ అయ్యి ఉండేది అని ఆ కథలో అంత పొటెన్షియల్ ఉందని పవన్ కి పడుంటే బాగుండేది అని ఎస్ జె సూర్య తాజాగా వెల్లడించాడు. సో ఇలా పవన్ వదిలేసిన ఎన్నో సినిమాల్లో ఈ సినిమా ఒకటి కొత్తగా చేరింది అని చెప్పాలి.

More from Filmibeat

Read more about: pawan kalyan kushi sj suryah
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X