1000 కోట్లు కుమ్మేసిన ప్రభాస్ మోస్ట్ పాపులర్ నెంబర్ వన్ స్టార్‌గా.. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ స్థానాలేంటో

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే దేశంలో చిన్న చూపు.. ఎన్నో వేదికలపై మన నటీనటులకు , సాంకేతిక నిపుణులకు సైతం అవమానాలు జరిగాయి. ఈ విషయాన్ని చిరంజీవి వంటి పెద్దలు ఎన్నోసార్లు , ఎన్నో వేదికలపై చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ సినిమా అంటే హిందీ సినిమా అనే రోజుల నుంచి.. భారతీయ సినిమా అంటే తెలుగు సినిమా అనే రేంజ్‌కు చేరుకున్నాం. ఇప్పుడు భారతదేశంలో ఏ మూలకి వెళ్లినా తెలుగు సినిమా అంటే చాలు జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన దర్శకుల ప్రతిభ, విజువలైజేషన్, గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ , కథ, కథనం బాలీవుడ్‌ను దాటి ఎక్కడికో వెళ్లిపోయాయి.

బాహుబలి వేసిన బాటలో పుష్ప, ఆర్ఆర్ఆర్, హనుమాన్ , కార్తీకేయ -2 సినిమాలతో టాలీవుడ్ పేరు అంతర్జాతీయంగా మారుమోగుతోంది. తాజాగా నాగ్ అశ్విన్ - ప్రభాస్‌ల కల్కి 2898 ఏడీతో ఇది మరో రేంజ్‌కు చేరుకుంది. ఈ పరిణామాలతో తెలుగు నటీనటులు, సాంకేతిక నిపుణులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది. కాన్సెప్ట్ బాగుండి.. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంటే చాలు మిగతా భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు . బాలీవుడ్ స్టార్స్ సైతం ఇప్పుడు తెలుగు కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారంటే అతిశయోక్తి కాదు.. కనీసం గెస్ట్ రోల్ అయినా సరే ఇమేజ్ పక్కకు పెట్టి మరీ నటించేందుకు ముందుకొస్తున్నారు.

Do you know prabhas most popular star in Telugu Here is Ormax India survey about top heros

కల్కి విజయంతో ప్రఖ్యాత ప్రొడక్షన్ సంస్థలు, దిగ్గజ డైరెక్టర్ల చూపు టాలీవుడ్‌పై పడటంతో పాటు మన హీరోలతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది పుష్ప -2, దేవర పార్ట్ -1, ఓజీ వంటి తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి. వీటిపైనా చిత్ర సీమలో భారీ అంచనాలున్నాయి. నార్త్‌లో తెలుగు సినిమాల జైత్రయాత్ర నేపథ్యంలో అక్కడ థ్రియేట్రికల్ రైట్స్ కోసం విపరీతమైన పోటీ ఉంది. చాలా పెద్ద స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి వాటిని సొంతం చేసుకుంటున్నారు బడా బాబులు.

తెలుగు సినిమాల రేంజ్ అలా ఉంటే తెలుగు హీరోలు ఏమైనా తక్కువ తిన్నారా.. వాళ్లు పాన్ ఇండియా స్టార్స్ రేంజ్ నుంచి గ్లోబల్ స్టార్స్‌గా మారిపోయారు. హిందీలో బడా స్టార్స్‌గా చెప్పుకునే వారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబొర్లాపడితే, మన హీరోలు మాత్రం వందల కోట్లను అవలీలగా దాటేస్తున్నారు. లేటేస్ట్ పాన్ ఇండియా సెన్సేషన్ కల్కి 2898 ఏడీ చాలా సింపుల్‌గా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుకుని తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. ముఖ్యంగా హీరో ప్రభాస్ ‌నిర్మాతల పాలిట కల్పవృక్షంగా మారిపోయారు.

Do you know prabhas most popular star in Telugu Here is Ormax India survey about top heros

ఈ క్రమంలో తెలుగులో మోస్ట్ పాపులర్ హీరోలు ఎవరు అన్న దానిపై ఓర్మాక్స్ మీడియా అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. జూన్ నెలకు సంబంధించి మోస్ట్ పాపులర్ మేల్ తెలుగు ఫిల్మ్ స్టార్స్ పేరిట ఓ జాబితా విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ అగ్రస్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నాని, రవితేజ, చిరంజీవి, విజయ్ దేవరకొండలు నిలిచారు. ప్రస్తుతం ఈ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X