సొంతంగా విమానం తయారు చేసుకొని ప్రయాణించే హీరో మీకు తెలుసా? ఆ యాక్టర్ వద్ద ఖరీదైన వస్తువులు ఏమున్నాయంటే?
ఇండియన్ సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడిగా ఆర్ మాధవన్‌కు మంచి గుర్తింపు ఉంది. లవర్ బాయ్‌గా, మాస్ హీరోగా, ఫ్యామిలీ మ్యాన్‌గా ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే హీరోల్లో ఆయన ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కెరీర్ కొనసాగిస్తున్న ఆయనకు వేరే జీవితం ఉందంటే.. చాలా మందికి తెలియదు. ఇటీవల ఇంటర్వ్యూలో యాక్టింగ్‌ను పక్కన పెట్టి తన లైఫ్‌లో ఏం చేస్తున్నారు? ఆయన వద్ద ఉన్న విలువైన వస్తువులు ఏమున్నాయనే విషయంలోకి వెళితే..
నటన మాత్రమే కాకుండా మరో ప్రవృత్తి
నటన అనేది నా వృత్తి. నాకంటూ ఓ స్పేస్‌ను పెట్టుకొని ప్రవృత్తి కోసం చాలా పనులు చేస్తుంటాను. నా బుర్రను ఎప్పుడూ ఖాళీగా ఉంచను. ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాను. నా ఎడ్యుకేషన్ వల్ల వచ్చిన నాలెడ్జ్‌ను. నేర్చుకొన్న విషయాలతో ప్రయోగాలు చేస్తుంటాను. అందుకే నా జీవితంలో బోర్ అనే విషయం ఉండదు అని మాధవన్ చెప్పారు.

నాకు ఫ్లయిట్స్, హెలికాప్టర్లను నడపడం అంటే చాలా ఇష్టం. నేను ఇంజినీరింగ్ కావడం వల్ల నేను స్వయంగా చిన్న చిన్న విమానాలు, హెలికాఫ్టర్లు తయారు చేసుకొంటాను. వాటిని తయారు చేసి వాటిలో విహరిస్తుంటాను. నాకు విమానాలు తయారు చేసుకోవడం, వాటిలో ఫ్లై చేయడం చాలా ఇష్టం అని మాధవన్ చెప్పారు.

తీరిక వేళల్లో గోల్ఫ్ ఆడటం
అలాగే నాకు గోల్ఫ్ ఆడటం అంటే మరీ ఇష్టం. తీరిక చేసుకొని గోల్ఫ్ ఆడటాన్ని ఎంజాయ్ చేస్తుంటాను. నేను బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. సూపర్ బైక్స్ నడపడం అంటే మరీ ఇష్టం. అలాగే మంచు పర్వతాల్లో స్కేటింగ్ చేయడం నా హాబీ. వివిధ ప్రాంతాలను తిరిగి కొత్త విషయాలను తెలుసుకొంటాను. అలాగే శాఖాహారం పుడ్ ఎక్కడ మంచిది దొరుకుతుందనే విషయంపై ఆసక్తి చూపుతాను అని ఆయన అన్నారు.
నావలు నడిపే కెప్టెన్‌గా
కరోనా సమయంలో నావలు నడిపే కోర్సు చదువుకొన్నాను. ఆరు నెలలు ఆన్‌లైన్‌లో కోర్సు పూర్తి చేసి కెప్టెన్‌గా బోట్స్ నడిపే లైసెన్స్ సంపాదించాను. ఇటీవలే ఓ బోట్ కొన్నాను. దుబాయ్‌లో దానిని పెట్టాను. అందులో ప్రయాణిస్తూ సముద్రం మధ్యలోకి వెళ్తుంటాను. అక్కడే రాత్రంతా పడవలోనే గడుపుతాను. ఇలాంటి విషయాలు నాకు చాలా ఎనర్జీ ఇస్తుంటాయి అని చెప్పారు.

ఖరీదైన వస్తువులు కొనడం
నాకు చాలా ఖరీదైన వస్తువులను కొనడం చాలా చేస్తుంటాను. నా లైఫ్‌కు కావాల్సినవి.. నాకు సంతృప్తిని కలిగించే వస్తువులను కొంటాను. జీన్స్ ప్యాంట్స్, గ్లాసెస్ లాంటి బాగా కొంటాను. అయితే నేను చాలా డబ్బు పెట్టి ఇంటిని కొనుగోలు చేశాను. మధ్య తరగతి నుంచి వచ్చిన నాకు అలాంటి విలాసవంతమైన భవనం అవసరం లేదు. మేము ముగ్గురం ఉండటానికి అంత ఇల్లు అవసరం లేదని ఇప్పుడు అనిపిస్తుంది అని ఆర్ మాధవన్ అన్నారు.
ఆర్ మాధవన్ కెరీర్ ఇలా..
ఇక మాధవన్ కెరీర్ విషయానికి వస్తే.. హిందీలో యాక్టర్ ఎంట్రీ ఇచ్చి తమిళంలో స్థిరపడ్డారు. మణిరత్నం దర్శకత్వంలో సఖీ చిత్రంలో నటించిన తర్వాత అక్కడే భారీ ఆఫర్లు వచ్చారు. ఆ తర్వాత తెలుగు, హిందీలో కూడా సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన నటించిన షైతాన్ చిత్రం భారీ విజయం అందుకొన్నది. ఈ సినిమా సుమారుగా 200 కోట్ల రూపాయలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











