Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ ఎన్ని కోట్లు తీసుకొన్నాడో తెలుసా?
దేవదాసు చిత్రంతో 2006లో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇప్పటికీ యంగ్ అండ్ డైనమిక్ హీరోగా కొనసాగుతున్న రామ్ పోతినేని గురించి అందరికీ తెలిసిందే. తన యాటిట్యూడ్, స్పాంటేనియస్ కామెడీ, డైలాగ్ డెలివరీతో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. జగడం, రెడీ, మస్కా గణేష్, రామరామ కృష్ణకృష్ణ, కందిరీగ, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో నటించాడు.
ముఖ్యంగా పూరీ జగన్నాథ్ తో కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. ఈక్రమంలోనే సీక్వెల్ సినిమాకు ప్లాన్ చేశారు. అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమాలోనూ రామ్ పోతినేనియే హీరోగా కనిపించనున్నారు. ఈ మధ్య వరుసగా ఫ్లాపులు వస్తున్నా ఈయన తన రెమ్యునరేష్‌న్ ను మాత్రం అస్సలే తగ్గనివ్వట్లేదు. ముఖ్యంగా డబుల్ ఇస్మార్ట్ కోసం షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలవడంతో.. డబుల్ ఇస్మార్ట్ ను అంతకు మించి తీసుకు రావాలని.. ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టాలని అనుకుంటున్నారు. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం చాలా మంది ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా.. పూరీ కనెక్ట్స్ కింద ఛార్మీ కౌర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ పోతినేని సరసన సంజయ్ దత్, కావ్య థాపర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా కోసం రామ్ పోతినేని చాలానే డబ్బులు ఛార్జ్ చేసినట్లు తలుస్తోంది. ముఖ్యంగా డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం రామ్ పోతినేని పాతిక కోట్ల పారితోషికం అందుకుంటున్నారట. అక్షరాలా 15 కోట్ల రూపాయలు అందుకున్నారని తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలు సైతం ఇంత మొత్తం పారితోషికం అందుకోవట్లేదు. కానీ ఈ కుర్ర హీరో మాత్రం హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా పాతిక కోట్ల వరకూ తీసుకుంటూ బాగానే వెనకేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











