500 రూపాయలతో కెరీర్ స్టార్ట్.. 15 కోట్ల రెమ్యునరేషన్‌తో మాస్ హీరోగా.. 100 కోట్ల తెలుగు హీరో ఎవరో తెలుసా?
సినిమా పరిశ్రమలో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం ఊహకు అందకుండా ఉంటుంది. ఒక రోజు స్టార్‌గా ఉన్న వాళ్లు మరో రోజు కనిపించకుండా పోతారు. అలాగే ఓ చిన్న యాక్టర్ కూడా ఉన్నట్టుండి ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిపోతారు. అలా తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉండి.. మాస్ హీరోగా, అలాగే ప్రస్తుతం స్టార్ హీరోగా చెలామణి అవుతున్న నటుడి గురించిన వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్‌లో హిట్టు, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సంవత్సరానికి మూడు నుంచి 5 సినిమాలు చేస్తున్న హీరోల్లో ఆయన ఒకరు. ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత మూవీస్‌లో అతి చిన్న పాత్రలు, విలన్ వేషాలు వేస్తూ కాలాన్ని నెట్టుకొంటూ వచ్చారు. ప్రతీ నటుడిలో ఉండే కృష్ణా నగర్ కష్టాలను చూశారు. అతడే మాస్ మహారాజా రవితేజ..

కెరీర్ ఆరంభంలో రవితేజ కనీసంగా 500 రూపాయల దినసరి వేతనంతో కెరీర్ ఆరంభించాడు. ఆ తర్వాత పలు సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. నటుడిగా చిన్న చిన్న పాత్రలు వేస్తూ సినిమా రంగంలో గుర్తింపు పొందారు. కర్తవ్యం, కన్నడ చిత్రం అభిమన్యు, చైతన్య, ఆజ్ కా గుండారాజ్ లాంటి చిత్రాల్లో గుర్తుపట్టని క్యారెక్టర్లు చేశారు.
నటుడిగా నిలదొక్కుకొనేందుకు అల్లరి ప్రియుడు, మనసిచ్చి చూడు, నిన్నే పెళ్లాడుతా లాంటి సినిమాల్లో ఫ్రెండ్, తదితర క్యారెక్లరు చేశాడు. ఆ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో నీ కోసం అనే సినిమాతో హీరోగా మారాడు. తొలి సినిమానే విజయం సాధించడంతో అప్పటి నుంచి వెనక్కి చూసుకోలేదు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఖడ్గం, వెంకీ, నా ఆటోగ్రాఫ్ లాంటి సినిమాలు నటుడిగా గుర్తింపు తెచ్చాయి. విక్రమార్కుడు సినిమాతో స్టార్ రేంజ్‌ను సొంతం చేసుకొన్నాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొంటున్నారు.
రవితేజ ఇటీవలే ధమాకా చిత్రంతో 100 కోట్ల రూపాయలు, చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలో కలిసి నటించి 225 కోట్ల రూపాయల వసూళ్లను సాధించాడు. ఇక భారీ బడ్జెట్, ఇంట్రెస్టింగ్ కటెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. త్వరలోనే ఆయన నటించిన ఈగిల్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రైడ్ సినిమా రీమేక్‌గా మిస్టర్ బచ్చన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవగణ్, రవితేజ కలిసి ఓ మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా పలు చిత్రాల్లో నటించేందుకు ప్రాజెక్టులను సిద్దం చేసుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











