సంపాదించుకొన్నదంతా ఫట్.. త్రివిక్రమ్‌తో సినిమాలు చేయకపోవడానికి కారణం అదే!
అలనాటి తెలుగు హీరో.. మురళీ మోహన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం కల్గిన ఈయన అనుకోకుండా సినిమాల్లోకి వచ్చారు. కానీ అదిరిపోయే హిట్ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా మారి అనేక చిత్రాలు తెరకెక్కించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన అతడు సినిమా తర్వాత తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఎందుకు సినిమాలు చేయలేదో వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చదువు అయిపోయిన వెంటనే పెళ్లి చేసుకున్న ఈయన ఆ తర్వాత వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. అయితే చూసేందుకు అందంగా ఉండడం, అందులోనూ సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉండడంతో ఈయనకు సినిమా ఆఫర్ ఇచ్చారట. అలా ఓవైపు బిజినెస్ చేస్తూనే కొన్ని సినిమాలు చేసిన ఈయన సూపర్ సక్సెస్ సాధించడంతో.. రెండేళ్లే బిజినెస్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత చెన్నై షిఫ్టు అయిపోయి మరీ వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు.

అయితే సినిమాల్లో హీరోగా చేస్తున్నప్పుడే ఆయన తన సోదరుడు కిశోర్‌తో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించారు. అలా చాలా సినిమాలు నిర్మించారు. ముఖ్యంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్టు రైటింగ్ నచ్చడంతో నేరుగా మురళీ మోహన్ యే ఆయన వద్దకు వెళ్లి తమతో ఓ సినిమా చేయాలని కోరారట. దీంతో నేను నా తొలి సినిమా వేరే వాళ్లతో చేస్తానని మాటిచ్చానని రెండో సినిమా మీతోనే చేస్తానని చెప్పారట. ఆ తర్వాత మాట ప్రకారంగా తమతోనే రెండో చిత్రం చేశారట.
ఆ సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన అతడు సినిమా. అయితే ముందుగా ఈ సినిమా కోసం ఓ బడ్జెట్ అనుకోగా.. అది మరింత ఎక్కువ అయిందట. సినిమా మీద ఉన్న నమ్మకంతో మురళీ మోహన్, కిశోర్ లు ఇద్దరూ మాట్లాడుకుని.. ఈ బడ్జెట్ విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు.. ఆయనే చూసుకోని అని వదిలేశారట. అలా మొత్తం బాధ్యతలు తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. తాను అనుకున్న స్థాయిలో సినిమాను నిర్మించడం విపరీతమైన లాభాలు రావడం జరగిందట.

ఇదంతా బాగానే ఉన్నా.. మురళీ మోహన్ ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడంతో.. నిర్మాణ పనులను తాను చూసుకోలేపకపోయారుట. అలా మళ్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి సినిమాలు నిర్మించే అవకాశం రాలేదని చెప్పారు. కానీ అంతా అనకున్నట్లుగా మా మధ్య గొడవలు లేవని.. తామే కావాలని అతడు సినిమా బడ్జెట్ విషయాలను ఆయనకు అప్పగించామని క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











