ఒకప్పుడు స్టార్ హీరో‌కు షూస్ మోసిన అసిస్టెంట్‌.. ప్రస్తుతం 100 కోట్లు తీసుకొనే సూపర్‌స్టార్ ఎవరో తెలుసా?

సినిమా పరిశ్రమలో బండ్లు ఓడలు.. ఓడలు బండ్లుగా మారుతుంటాయి. స్టార్ హీరోలు కాలం కలిసి రాక క్యారెక్టర్ ఆర్టిస్టుగాను.. చిన్న చిన్న పాత్రలు వేసే ఆర్టిస్టులు సూపర్ స్టార్స్‌గా మారిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. అలాంటి సంఘటనలు సినిమా పరిశ్రమలో కోకొల్లలు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోకు అసిస్టెంట్‌గా ఉన్న ఒక యువకుడు ప్రస్తుతం సినిమాకు 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకొంటున్న విషయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాంటి సూపర్ స్టార్ గురించిన వివరాల్లోకి వెళితే..

హిందీ సినిమా పరిశ్రమలో మోడల్‌గా జాకీ ష్రాఫ్ జీవితాన్ని హీరో సినిమా మలుపుతిప్పింది. సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో జాకీ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. అప్పట్లో ఆయన సినిమాల కోసం యూత్ ఎగబడి చూసేవారనే సంగతి తెలిసిందే.

Do You Know Salman Khan was assistant to Jackie Shroff, Now He is 100 crores Rumuneration Hero in Bollywood

జాకీ ష్రాఫ్ బాలీవుడ్‌లో స్టార్ హీరోగా చెలామణి అవుతున్న రోజుల్లో ఆయన ప్రముఖ రచయిత, దర్శకుడు సలీం ఖాన్ 1988 సంవత్సరంలో రూపొందించిన ఫలక్ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమాకు సలీం ఖాన్ కుమారుడు, నేటి సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ షూటింగులో జాకీ ష్రాఫ్‌కు అసిస్టెంట్‌గా వ్యవహరించారు.

సల్మాన్ ఖాన్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ.. సలీంఖాన్ దర్శకత్వంలో ఫలక్ సినిమా చేస్తున్నప్పుడు సల్మాన్ ఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. నా పాత్రకు సరిపోయే క్యాస్టూమ్స్, ముఖ్యంగా బట్టలు, షూస్, ఇతర వస్తువుల గురించి కేర్ తీసుకొనే వాడు. అప్పటికే ఆయనకు హీరో కావాలనే కోరిక ఉండేదని చెప్పారు అని జాకీ ష్రాఫ్ తెలిపాడు.

Do You Know Salman Khan was assistant to Jackie Shroff, Now He is 100 crores Rumuneration Hero in Bollywood

దాంతో సల్మాన్ ఖాన్ ఫోటోలను నేను ఇతర నిర్మాతలకు, దర్శకులకు ఇచ్చి అవకాశం ఇవ్వమని చెప్పేవాడిని. అలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ నటించిన మైనే ప్యార్ కియా సినిమా రిలీజై దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసింది. దాంతో ఆ సినిమా తర్వాత సల్మాన్ కెరీర్ రాకెట్‌లా దూసుకెళ్లింది. నేను ఆయనను చిన్న తమ్ముడిగా భావించే వాడిని అని జాకీ చెప్పాడు.

సల్మాన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. బీవీ హో తో ఐసీ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. ఆ సమయంలో మైనే ప్యార్ కియా సినిమా హిట్ కావడంతో మళ్లీ వెనక్కి తీరిగి చూసుకోలేదు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలకుపైగా రెమ్యునరేషన్ తీసుకొంటున్నాడు. దేశంలోని సూపర్ స్టార్స్‌లో ఒకడిగా అత్యంత పాపులారిటిని సంపాదించుకొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X