Shah Rukh Khan Watch Cost: షారుక్ ఖాన్ వాచీ ధర ఎన్ని కోట్లంటే? మెట్ గాలాలో ఖరీదైన వాచ్‌తో హంగామా

హాలీవుడ్‌లో అతిపెద్ద, అత్యంత పాపులర్ ఫ్యాషన్ షో మెటా గాలా సందడి మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా సినీ తారలు, సినీ ప్రముఖులందరూ ఈ ఫ్యాషన్ ఈవెంట్‌లో పాల్గొనడంతో వరల్డ్ వైడ్‌గా అందరి దృష్టి దీనిపైనే ఉంది. ప్రస్తుతం సినీ వర్గాల్లో, సినీ అభిమానులు, మీడియా ఛానెల్స్‌ చర్చ అంతా ఈ గ్లామర్ జాతరపైనే ఉండటం విశేషంగా మారింది. అయితే సినీ తారలు స్వర్గధామంగా భావిస్తూ.. ఒక్కసారైనా ఈ వేదికపై కనిపిస్తే చాలని ఉవ్విలూరుతుంటారు. అలాంటి ఈ వేదికపై ప్రపంచ సినీ దిగ్జజాల మధ్య బాలీవుడ్ సూపర్ స్టార షారుక్ ఖాన్ తనదైన శైలిలో అందర్నీ ఆకర్షించారు. షారుక్ ఖాన్ హంగామాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మెట్ గాలా (Met Gala) అంటే?
అందర్నీ ఆకట్టుకొంటున్న మెట్ గాలాను ఇంతకు ముందు క్యాస్టూమ్ ఇన్‌స్టిట్యూట్ బెనెఫిట్ అని పిలిచే వారు. మెట్రోపాలిటన్ మ్యూజియమ్ ఆఫ్ ఆర్ట్స్ క్యాస్టూమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రయోజనాల కోసం ఫండ్ రైజింగ్ చేసే వార్షిక ఈవెంట్. దీనిని వరల్డ్ అత్యంత గ్లామరస్ ఫ్యాషన్ ఈవెంట్‌గా భావిస్తుంటారు. ప్రస్తుతం ఈవెంట్ న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియ్ ఆఫ్ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతున్నది. ఈ ఏడాది థీమ్ విషయానికి వస్తే.. సూపర్ ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్‌గా నిర్ణయించారు.

Shah Rukh Khan s Patek Philippe watch Cost

Photo Courtesy: https://www.instagram.com/sabyasachiofficial/

వరల్డ్‌లోనే పాపులర్ ఫ్యాషన్‌ షోగా భావించే ఈవెంట్‌లో షారుక్ ఖాన్‌తోపాటు కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్, తిల్జిత్ దోసాంజ్, సవ్యసాచి ముఖర్జీ, మనీష్ మల్హోత్రా, ఇషా అంబానీ, నటాషా పూనావాలా తదితరులు ఇందులో పాల్గొన్నారు. బ్లాక్ థీమ్‌తో సాగే ఫ్యాషన్ ఈవెంట్‌లో విచిత్ర చిత్ర వేషాధారణతో తన అిమానులను ఆకట్టుకొనే ప్రయత్న్ం చేస్తున్నారు.

షారుక్ ఖాన్‌ నలుపు రంగు దుస్తుల్లో కనిపించారు. చేతిలో మంత్రదండం పట్టుకొని మెజీషియన్ అవతారంలో దర్శనమిచ్చారు. చేతికి నాలుగు ఉంగరాలు, మెడలో మెటల్‌తో చేసిన పూసల దండలు, వివిధ రకాల చైన్స్‌ను ధరించాడు. ఆలాగే కళ్లకు నల్లటి గాగుల్స్‌తో స్టైల్ ఐకాన్‌గా కనిపించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. షారుక్ పెట్టుకొన్న వాచ్‌పై అందరి దృష్టిపడింది.

షారుక్ ఖాన్ ధరించిన వాచీ విషయానికి వస్తే. పాటెక్ ఫిలిప్పే గ్రాండ్ కాంప్లికేషన్స్ 6300G వాచ్ ధరించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రమఖ వాచీ తయారీ సంస్థ దీనిని తయారు చేసింది. ఈ అరుదైన వాచీ ధర 2.5 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 21 కోట్ల రూపాయలు. ఇలాంటి అరుదైన వాచీని ధరించి సినీ తారల కళ్తు తనపైకి తిప్పుకొన్నారు.

షారుక్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. 2023 సంవత్సరంలో పఠాన్, జవాన్ లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకొన్నారు. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 చిత్రంలో అతిధి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత వచ్చిన డంకీ చిత్రం దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఆయన కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. 2025 చివర్లో గానీ, 2026 ఆరంభంలో కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X