మహేష్ బాబు 100 సార్లు చూసిన సినిమా గురించి మీకు తెలుసా? బావ కోసం సూపర్ స్టార్ లీక్

యువ హీరో సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం హరోమ్ హర. సెహారీ చిత్రానికి దర్వకత్వం వహించిన సాగర్ ద్వారక ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సుమంత్ జీ నాయుడు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూన్ 14వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు ఆడియో ఆసక్తికరంగా ఉండటమే కాకుండా అందర్నీ ఆకట్టుకొన్నది. ఈ వివరాల్లోకి వెళితే..

యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న హరోమ్ హర సినిమా కుప్పం బ్యాక్ డ్రాప్‌గా సాగుతుంది. ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాలు పెరిగాయి. తుపాకుల తయారీకి సంబంధించిన అంశం మరింత ఆకట్టుకొన్నది. తయారు చేసిన తుపాకులకు సూపర్ స్టార్ కృష్ణ, అమితాబ్ బచ్చన్ అంటూ పేర్లు పెట్టుకోవడం క్రేజీగా అనిపించింది.

Do You Know Super Star Mahesh Babu Watched Mosagallaku Mosagadu 100 times

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విశ్వక్ సేన్, అడివి శేషు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి, అభిమానులకు సుధీర్ బాబు ఒక ఇంట్రెస్టింగ్ ఆడియోను ప్లే చేశారు. ఆ ఆడియోలో సూపర్ స్టార్ మహేష్ బాబును సుధీర్ బాబు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ పశ్నలకు చాలా ఆసక్తిగా సమాధానం చెప్పారు.

ఇక మహేష్ బాబును మొదట.. తుపాకులు, గన్స్ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాల్లో మీరు నటించిన ఏ సినిమా ఇష్టం? దాని కోసం ఏదైనా స్పెషల్‌గా ట్రైనింగ్ అయ్యారా అంటే.. నాకు గన్స్ ఉపయోగించే అవకాశం టక్కరి దొంగ సినిమా రూపంలో వచ్చింది. ఆ సినిమాలో మొదటిసారి నేను గన్స్ ఉపయోగించాను. దాని కోసం ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు అని చెప్పారు.

ఇక గన్స్ అనగానే మీకు గుర్తు వచ్చే హీరో ఎవరు అంటే.. నాకు గన్స్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది మోసగాళ్లకు మోసగాడులో మా నాన్న సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకు వస్తాడు. ఆయన తప్ప మరోకరు ఇప్పటి వరకు నా మదిలో రాలేదు. గన్ చూడగానే ఆయనే కళ్ల ముందు కనిపిస్తాడు అని మహేష్ చెప్పాడు.

Do You Know Super Star Mahesh Babu Watched Mosagallaku Mosagadu 100 times

ఇక గన్స్ రిలేటేడ్ సినిమా అంటే ఏది గుర్తుకు వస్తుందంటే.. మళ్లీ నాకు మోసగాళ్లకు మోసగాడు మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆ సినిమాను దాదాపు 100 సార్లకుపైగా చూశాను. ఆ సినిమా అంటే నాకు అంత ఇష్టంగా ఉంటుంది. అందులో నాన్నగారు కనిపించిన విధానం, తీసిన విధానం నాకు నచ్చుతుంది అని మహేష్ బాబు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X