Rajinikanth: రూ.1000లతో కెరీర్ స్టార్ట్ చేసిన రజినీకాంత్.. 'లాల్ సలాం'లో 30 నిమిషాల కోసం అన్ని కోట్లా?
ఇండియన్ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ కీలక పాత్ర పోషించిన చిత్రం 'లాల్ సలాం'. ఈ మూవీ మరో నాలుగు రోజుల్లో అనగా ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్‌గా తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించడం విశేషం. దర్శకత్వానికి సుమారు ఏడేళ్ల పాటు బ్రేక్ తీసుకున్న ఐశ్వర్య మళ్లీ ఇప్పుడు ఈ మూవీని తెరకెక్కించారు.
క్రికెట్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. మోయిద్దీన్ భాయ్ అనే కీలక పాత్రను పోషించారు రజినీ. అయితే ఈ చిత్రం కోసం ఆయన ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు? సినిమాలో ఆయన ఎంత సేపు కనిపించనున్నారు? అనే వివరాలను తెలుసుకుందాం..

రూ.1000లతో మొదలు : కె.బాలచందర్ దర్శకత్వంలో 'అంతులేని కథ'తో లీడ్ రోల్స్ పోషించడం ప్రారంభించిన రజనీకాంత్ ఈ చిత్రానికి రూ.1000 రపాయలు అందుకున్నారట. ఇదే ఆయనకు తొలి రెమ్యునరేషన్. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో విలన్‌గా, ఇతర పాత్రల్లో నటిస్తూ అనంతరం హీరోగా సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆయన భారీ స్థాయిలో పారితోషికాన్ని అందుకుంటున్నారు. రీసెంట్గా జైలర్ చిత్రంతో భారీ బ్లాక్ బాస్టర్ అందుకున్న ఆ సినిమాకు గానూ ఏకంగా దాదాపు రూ.200 కోట్ల వరకు తీసుకున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.
అరగంటకే అన్ని కోట్లా : ప్రస్తుతం రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 70 ఏళ్ల వయసులోనూ అయన స్క్రీన్‌పై కనపడితే చాలు చూసేందుకు కోట్లాది మంది అభిమానులు థియేటర్లకు తరలివస్తారు. అందుకే ఆయన రెమ్యునరేషన్‌కు కూడా భారీగానే ఉంటుంది. అయితే ఇప్పుడు 'లాల్ సలామ్' చిత్రానికి గానూ రజనీకాంత్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తాజాగా సమాచారం అందింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఆయన కేవలం అరగంట మాత్రమే కనిపిస్తారట. కానీ దీని కోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ను అందుకున్నారని తెలిసింది. దాదాపు రూ.40 కోట్ల వరకు పారితోషికాన్ని పుచ్చుకున్నారట. అంటే ఈ లెక్కన ఆయన నిమిషానికి రూ. 1.33 కోట్లు తీసుకుంటున్నారని అర్థం.
హైప్ కనపడట్లేదు : అయితే ఈ లాల్ సలామ్ చిత్రం రజనీకాంత్ లాంటి స్టార్ కాస్ట్‌తో వస్తున్నప్పటికీ ఎక్కడా హైప్ కనిపించట్లేదు. సినిమా గురించి ఎవరూ పెద్దగా చర్చించుకుంటున్నట్లు కనపడట్లేదు. మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి..

అక్కడ సినిమాపై నిషేధం : లాల్ సలాం చిత్రంలో మతకలహాల అంశం కూడా ఉండనున్నట్టు తెలిసింది. దీంతో ఈ చిత్రంపై అరబ్ దేశమైన 'కువైట్'లో నిషేధం విధించినట్టు వార్తల వస్తున్నాయి. మరిన్ని అరబ్ దేశాలు కూడా ఈ సినిమాపై బ్యాన్ నిర్ణయాన్ని తీసుకుంటాయని ప్రచారం సాగుతోంది.
ఇకపోతే దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. ఇంకా చిత్రంలో జీవిత రాజశేఖర్, ధన్యబాలకృష్ణన్, లివింగ్‍స్టన్, విఘ్నేశ్, అనంతిక సనిల్‍కుమార్, సెంథిల్, తంబి రామయ్య, కేఎస్ రవికుమార్ నటించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











