Raviteja: హీరో కాక ముందు సీరియల్‌లో నటించిన మాస్ మహారాజా.. ఆ హిట్ సీరియల్ పేరేంటో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ.. ఎలాంటి సపోర్ట్ లేకుండా.. ఎన్నో కష్టాలు, ఎన్నో అవమాలు ఎదుర్కొని ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మొదట హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమలు చేశారు. అయితే ఈ సినిమాల్లోకి రాకముందే రవితేజ ఓ సీరియల్ లో నటించారనే విషయం చాలా మందికి తెలియదు. ఓ సూపర్ హిట్ సీరియల్ లో ఆయన ఒక పాత్రలో నటించారని తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం, టాలెంట్ మాత్రమే కాదు.. బ్యాగ్రౌండ్ కూడా ఉండాలి. అయితే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకరు మాస్ మహారాజ్ రవితేజ. ఆయన ఇండస్ట్రీలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి ఎన్నో సూపర్ హిట్ట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఆయన ఎన్నో అవమాలు, కష్టాలు పడినట్లు ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో చెప్తూ క్లారిటీ ఇచ్చాడు రవితేజ.

మొదట క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు.. అసిస్టెండ్ డైరెక్టర్ గా చేస్తూ.. ఆ తర్వాత పూర్తి స్థాయి నటుడిగా మారాడు రవితేజ. చిన్న చిన్న క్యారెక్టర్స్ తో స్టార్ట్ చేసి స్టార్ హీరోగా ఎదిగి.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును, భారీ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు రవితేజ. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఏడాది రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు రవితేజ. అయితే రవితేజ కెరియర్ ఆరంభంలో ఓ సిరియల్ నటించాడనే విషయం చాలా మందికి తెలియదు.
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్న సమయంలోనే రవితేజ ఋతురాగాలు అనే సీరియల్ లో నటించారనే విషయం చాలా మందికి తెలయక పోవచ్చు. ఈ సీరియల్ దూర దర్శన్ లో ప్రసారం అయ్యేది. అప్పట్లో ఈ ధారావాహిక సూపర్ డూపర్ హిట్ అయింది. రాజీవ్ కనకాల హీరోగా రూపాదేవి హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సీరియల్ లో రవితేజ ఒక ఎపిసోడ్ లో చిన్న క్యారెక్టర్ లో కనిపిస్తారు.
ఋతురాగాలే రవితేజ నటించిన ఫస్ట్ అండ్ లాస్ట్ సీరియల్ కాగా... ఆ తర్వాత పలు సీరియల్స్ లో ఆఫర్ వచ్చినప్పటికీ రవితేజ మాత్రం వాటికి నో చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే... ఆయన ఫోకస్ మొత్తం సినిమాలనే పైనే ఉండేది. ఈ నేపథ్యంలోనే హీరో అవ్వాలన్న ఆయన డ్రీమ్‌ను ఫుల్ ఫిల్ చేసుకున్నాడు. అందుకే సీరియల్స్ వైపు మళ్లీ చూడలేదని అర్థం అవుతుంది.

ప్రస్తుతం రవితేజ ఈగల్ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం... వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది. కావ్యా థాపర్ ఇందులో హీరోయిన్ గా నటించింది. నవదీప్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చూడాలి మరి సంక్రాంతి విన్నర్ రవితేజ అవుతాడా లేదా అనేది.


Click it and Unblock the Notifications











