Varun Tej ఏంది వరుణ్ తేజ్ అసలు పేరు ఇదా? ఇన్నాళ్లు ఎందుకు దాచారంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత చేస్తున్న చిత్రం ఆపరేషన్ వాలంటైన్ చిత్రం. ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ సౌత్ టు నార్త్ వరకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. అయితే ఆ ఇంటర్వ్యూల్లో వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. ఆయన అసలు పేరును బయటపెట్టారు. వరుణ్ తేజ్ అసలు పేరేంటి.. ఎందుకు ఇన్నాళ్లు దాచారు అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

అందాల రాక్షసితో ఏడుడగులు..
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజీని తెచ్చుకున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముఖంద చిత్రంతో తొలిసారి స్క్రీన్ మీద మెరిసిన వరుణ్ తేజ్.. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచెతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాతో వరుణ్ తేజ్ గ్రాఫ్ మరింత పెరిగింది. రెండో సినిమాతోనే సంచలనం సృష్టించాడు. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగా ప్రిన్స్ ఇటీవల ప్రేయసి లావణ్యతో ఏడడుగులు వేశాడు.

Do You Know The Real Name of Mega Prince Varun Tej News Goes Viral?

ఆరు ఏళ్లుగా సీక్రెట్ లవ్
ఆరు ఏళ్లుగా సీక్రెట్ గా ప్రేమించుకున్న లావణ్య వరుణ్.. గత ఏడాది పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. ఇక ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసిన ఈ జంట.. సినిమాలతోనూ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల లావణ్య మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది. పెళ్లి తర్వాత నటించిన మొదటి సిరీస్ కావడంతో అందరూ ఆసక్తి చూపించారు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా ఓటీటీలో మంచి ఆదరణ లభించింది.

Do You Know The Real Name of Mega Prince Varun Tej News Goes Viral?

వరుస ఇంటర్వ్యూలు...
ఇప్పుడు వరుణ్ తేజ్ వంతు వచ్చేసింది. పెళ్లి తర్వాత నటిస్తున్న చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఈ సినిమాతో మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ నటిస్తుంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వరుణ్ తేజ్ తో సహా చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. సౌత్ నుంచి నార్త్ వరకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ... వరుణ్ తేజ్ తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. మార్చి 1న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కాగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్ ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశారు.

అసలు పేరు ఇదే...
ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. తన అసలు పేరును బయటపెట్టారు. వరుణ్ తేజ్ తన అసలు పేరు 'సాయి వరుణ్ తేజ్' అని తెలిపారు. స్క్రీన్ మీద పెద్దదిగా ఉంటుందని సాయిని మేకర్స్ తీసేశారని చెప్పుకువచ్చాడు. పాస్‌పోర్టులో అన్ని సర్టిఫికేట్స్‌లో 'సాయి వరుణ్ తేజ్' అని ఉంటుందని స్పష్టం చేశాడు వరుణ్ తేజ్. అలా సాయి వరుణ్ తేజ్ కాస్త.. వరుణ్ తేజ్ గా మారింది. ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీలో సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు. ఇప్పుడు సాయి వరుణ్ తేజ్. ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X