తొలిప్రేమ రీమేక్‌తో బ్లాక్‌ బస్టర్.. ఆ తర్వాత 23 డిజాస్టర్స్.. ఆ స్టార్ హీరో కొడుకు ఎవరో తెలుసా?

సినీ పరిశ్రమలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. 60, 70 దశకం నుంచి వినోద పరిశ్రమలో వారసుల రాక కనిపిస్తూనే ఉంది. అయితే తల్లిదండ్రుల వారసత్వంపై ఆధార పడి ఉండకుండా సొంత టాలెంట్‌తో రాణించిన వారికే ప్రేక్షకులు ఆదరణ కురిపించి అందలం ఎక్కించారు. అలానే ఓ యువ హీరో బాలీవుడ్ ఎంట్రీ ఘనంగా జరిగినా.. ఆ తర్వాత ఊపందుకోలేకపోయింది. ఆ హీరో వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌ స్టార్ హీరోల్లో జితేంద్ర ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఓ పక్క అమితాబ్ సునామీలా సినిమాలతో జైత్రయాత్ర కొనసాగిస్తుంటే.. మరో పక్క జితేంద్ర వరుస విజయాలతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. తెలుగులో భారీ విజయాలు అందుకొన్న కృష్ణ, ఎన్టీఆర్ సినిమాలతో విజయయాత్ర కొనసాగించారు. అలాంటి హీరో రిటైర్మెంట్‌కు చేరువైన సమయంలో తన కుమారుడు తుషార్ కపూర్‌ను సినీ రంగానికి పరిచయం చేశారు.

Do You Know Tushar Kapoor given 22 Flop in 23 years span of Career in Bollywood

జితేంద్ర తన కుమారుడు తుషార్ కపూర్ ఎంట్రీ కోసం తెలుగులో భారీ విజయం సాధించిన తొలిప్రేమను ఎంచుకొన్నారు. పవన్ కల్యాణ్ పాత్ర పోషించిన సినిమాతో కొడుకును లాంఛ్ చేశారు. ముజే కుచ్ కెహ్నా హై టైటిల్‌తో రూపొందిన సినిమాకు సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించగా.. కరీనాకపూర్ హీరోయిన్‌గా నటించింది. సుమారు 10 కోట్లతో నిర్మిస్తే.. 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

అయితే 2001 సంవత్సరంలో తొలి చిత్రమే తుషార్ కపూర్‌కు బ్లాక్ బస్టర్.. ఇక ఆయన కెరీర్‌కు ఢోకా లేదని అందరూ భావించారు. తొలి సినిమా తర్వాత భారీ ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత క్యా దిల్ నే కహా, కుచ్ తో హై, గాయబ్, ఖాకీ, ఇన్సాన్, గోల్ మాల్, సండే, గోల్ మాల్ రిటర్న్స్, బజాతే రోహ్, పోస్టర్ బాయ్స్, లక్ష్మీ, మారిచ్ సినిమాల్లో నటించారు. అయితే ఈ సినిమాలన్నీ దాదాపు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

Do You Know Tushar Kapoor given 22 Flop in 23 years span of Career in Bollywood

తుషార్ కపూర్ కెరీర్ మొత్తంగా 23 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. అయితే తన కెరీర్‌లో 21 ఫ్లాపులు వచ్చాయి. అయితే డిఫరెంట్‌గా సినిమా కథలు ఎంచుకొన్నా ప్రేక్షకులు మాత్రం కనికరించలేదు. దాంతో ఆయన కెరీర్ అయోమయంలో పడింది.

అయితే సినిమాలు కలిసి రాకపోవడంతో వెబ్ సిరీస్‌తో ట్రై చేశాడు. బాబూ సబ్కీ పటేగీ, పాప్ కౌన్? వెబ్ సిరీస్‌లో నటించారు. అయినా వెబ్ సిరీస్ వర్క్ కాలేదు. దాంతో ఆయన కెరీర్‌ డిజాస్టర్‌తోనే కొనసాగుతున్నది. అయితే రానున్న రోజుల్లోనైనా కెరీర్ గాడిన పడుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X