Venkatesh: పాన్ ఇండియా మూవీ సైంధవ్ కోసం వెంకీ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
విక్టరీ వెంకటేష్.. దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను సంపాందిచుకున్నాడు. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ కు వెంకీ సినిమాలంటే ఆసక్తిగా చూస్తారు. ఇక ఆయన నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్. వెంకీ కెరియర్లో ఈ సినిమా మొదటి సారిగా పాన్ ఇండియా లెవెల్ లో రాబోతుంది. అయితే ఈ సినిమా కోసం వెంకటేష్ షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇక ఈ సినిమా కోసం వెంకటేష్ ఎన్నో కోట్లు తీసుకున్నారో ఓసారి లుక్కేద్దాం.
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్... ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఆయన సోలో హీరోగా రాణిస్తూనే.. మరోవైపు యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేస్తున్నాడు. తాజాగా వెంకీ సంక్రాంతి బరిలోకి ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమాగా సైంధవ్ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రానికి హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.

సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ రిలీజ్ అనంతరం సినిమాపై రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు వెంకటేష్ తీసుకున్న పారితోషికం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇవ్వగా... 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల వస్తోంది.
వెంకీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దసరా సినిమాకు సంగీతం అందించిన సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇది వెంకటేష్ కెరియర్లో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

సైంధవ్ సినిమా కోసం దగ్గుబాటి హీరో భారీగానే ఛార్జ్ చేశారని సమాచారం. ఈ సినిమాకి ముందు వెంకటీ ఎఫ్ 3కోసం రూ.15 కోట్లు తీసుకున్నారని సమాచారం. ఇక సైంధవ్ పాన్ ఇండియా సినిమా కోసం.. వెంకటేష్ ఏకంగా రూ. 17 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల ఇన్ సైడ్ టాక్. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుండటంతో రెండు కోట్లు పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక వెంకటేష్ నటించిన ఈ సైంధవ్ సినిమాలో హీరోయిన్ శ్రధ్ధా శ్రీనాథ్ నటించింది. విలన్ గా నవాజ్జుద్దిన్ సిద్ధిఖి నటించారు. ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలువగా.. ఈ సినిమాకు పోటీగా నాగార్జున నా సామి రంగా, మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్ సినిమాలు వస్తున్నాయి. వీటితో పాటు రెండు తమిళ చిత్రాలు సైతం పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు కానున్నారో చూడాలి.


Click it and Unblock the Notifications











