రాంచరణ్‌ను వెనక్కి నెట్టిన విజయ్ దేవరకొండ.. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ కంటే టాప్ రేంజ్‌లో ఫ్యామిలీ స్టార్!

సినీ పరిశ్రమపై సోషల్ మీడియా ప్రభావం భారీగా పడుతున్నది. ఒకప్పుడు సినిమాల ప్రమోషన్స్ గోడ మీద పోస్టర్లు వేసి ప్రమోషన్స్ చేసుకొంటే.. ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ప్రచారాలు పెద్ద ఎత్తున్న చేస్తున్నారు. దాంతో వ్యూస్, ఫాలోవర్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. దాంతో హీరోలు కూడా ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్రచార సాధనాలను బలంగా మలచుకొంటున్నారు. అయితే తాజాగా తెలుగులో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన టాప్ హీరోల వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా అనగానే దేశవ్యాప్తంగా సినీ అభిమానులకు గుర్తొచ్చే హీరోలు ప్రభాస్, రాంచరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ హీరోల్లో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న వారిలో తెలుగు హీరోల్లో చాలా మందే ఉన్నారు. కానీ టాప్ ఫాలోవర్స్ కలిగిన వారిలో ఏ హీరో ఉన్నారంటే.. అది అల్లు అర్జున్ మాత్రమే.

Do You Know Vijay Deverakonda gets top Followers Than Ram Charan in Instagram Here is the Allu Arjun Prabhas details

తెలుగులో మిగితా హీరోలతో పోల్చుకొంటే.. ఐకాన్ స్టార్ అందనంత దూరంలో ఉన్నాడు. ఆయనకు సుమారుగా 25 మిలియన్ల మంది అంటే.. 2.5 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ 21.4 మిలియన్ల ఫాలోవర్స్ అంటే.. 2.14 కోట్ల మంది ఫాలోవర్స్‌తో రెండోస్థానంలో ఉన్నాడు.

ఇక మూడో స్థానంలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఉన్నాడు. ఆయనకు ఇన్స్‌టాగ్రామ్‌లో 21.1 మిలియన్ల మంది అంటే 2.1 కోట్ల మంది ఫాలోవర్స్‌తో మూడోస్థానంలో ఉన్నారు. ఇక ఆ తర్వాత 13.3 మిలియన్ల ఫాలోవర్స్‌తో మహేష్ బాబు నాలుగో స్థానంలో ఉన్నాడు. అనంతరం ఐదో స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ 11.7 మిలియన్లతో 5వ స్థానంలో నిలిచారు.

Do You Know Vijay Deverakonda gets top Followers Than Ram Charan in Instagram Here is the Allu Arjun Prabhas details

ఇక అందరికంటే తక్కువ ఫాలోవర్స్ కలిగి ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఆయనకు ఇన్స్‌టాగ్రామ్‌లో 7.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే టాప్ హీరోగా ఉన్న యంగ్ టైగర్‌కు ఇంత తక్కువగా ఫాలోవర్స్ ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. సీనియర్ హీరోల కంటే.. ఇటీవల వచ్చిన విజయ్ దేవరకొండకు మాత్రం సోషల్ మీడియాలో అత్యధిక మంది ఫాలో కావడం నిజంగా సర్‌ప్రైజింగ్ ఎలిమింట్‌గా చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉంటే.. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్, ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ దేవరకొండ, గేమ్ ఛేంజర్ సినిమాతో రాంచరణ్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చే SSMB29 మూవీతో మహేష్ బాబు, కల్కి మూవీతో ప్రభాస్, దేవర మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X