Remuneration: బ్లాక్‌బస్టర్ దిశగా మహారాజా.. విజయ్ సేతుపతి తీసుకున్న రెమ్యూనరేషన్ ఇంతేనా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం తన 50వ సినిమా మహారాజా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీకి విజయ్ సేతుపతి ఎంత పారితోషికం తీసుకున్నాడు అనే విషయం తాజాగా బయటకు వచ్చింది. మరి విజయ్ సేతుపతి మహారాజ మూవీ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ పై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.
మక్కల్ సెల్వన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే విజయ్ సేతుపతి కోలీవుడ్ లో ఉన్న మల్టీ టాలెంటెడ్ హీరోలలో ఒకరన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన విలన్, హీరో ఇలా ఏ క్యారెక్టర్ ఇచ్చినా అద్భుతంగా నటించి విమర్శకులను సైతం ఫిదా చేస్తాడు. ఇటీవల సేతుపతి తన 50వ సినిమా మహారాజాతో థియేటర్లలోకి వచ్చారు. నితిన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన మహారాజా మూవీ జూన్ 14న ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమత మోహన్ దాస్, అభిరామి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న మహారాజా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 40 కోట్లకు పైగా కలెక్షన్స్ కలెక్ట్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. మహారాజ మూవీ గనక 50 కోట్ల మార్క్ ను దాటితే ఆయన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసే అవకాశం ఉంది.
గతంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన కాతువాకుల రెండు కాదల్ సినిమా ప్రస్తుతానికి ఆయన కెరీర్లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన మూవీగా ఉంది. తమిళ మూవీ మహారాజా ఒక్క తమిళనాడులోనే కాకుండా కేరళ, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకతో కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ముఖ్యంగా తెలుగులో డబ్ అయిన సినిమాల్లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా విజయ్ సేతుపతి మహారాజ మూవీ హిస్టరీని క్రియేట్ చేసింది.

ఇక ఈ మూవీ కంటే ముందే విజయ్ సేతుపతి మార్కెట్ పెరిగినప్పటికీ ఆయన మహారాజా మూవీకి తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఈ మూవీలో హీరోగా నటించినందుకు గాను విజయ్ సేతుపతి కేవలం 20 కోట్లు మాత్రమే పారితోషికంగా అందుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో జవాన్ లాంటి పాన్ ఇండియా సినిమాలో విలన్ గా నటించినందుకు ఏకంగా 25 కోట్ల వరకు పారితోషకం అందుకున్న విజయ్ మహారాజా కోసం దానికంటే తక్కువ పారితోషకం తీసుకోవడం ఆశ్చర్యకరం అని చెప్పాలి.
కాగా ఇటీవల మహారాజా మూవీ ప్రమోషన్ లో విజయ్ సేతుపతి మాట్లాడుతూ అడ్వాన్స్ తప్ప ఇంకేమీ తీసుకోకుండానే పలు సినిమాల్లో నటించానని చెప్పడం గమనార్హం. విజయ్ తో పోల్చుకుంటే మార్కెట్ కూడా సరిగ్గా లేని చాలామంది హీరోలు 25 కోట్ల కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న ఈ టైమ్ లో ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నప్పటికీ విజయ్ సేతుపతి ఇంకా 20 కోట్లు మాత్రమే పారితోషకంగా తీసుకోవడం ఏంటని ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.


Click it and Unblock the Notifications











