నాగార్జున చేతిపై ఉన్న కొత్త టాటూ అర్థమేంటో తెలుసా?
కింగ్ నాగార్జున ఇటీవలే తన 60వ పుట్టినరోజు వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా 60వ బర్త్ డే అంటే షష్టిపూర్తి వేడుక లేదా అందరినీ పిలిచి పెద్ద ఫంక్షన్ జరుపుకోవడం లాంటివి చేస్తారు. కానీ నాగార్జున అలా చేయకుండా తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లారు. ఈ కారణంగానే గత వారం బిగ్ బాస్ షోకు కూడా హాజరు కాలేక పోయారు. దీంతో ఆ రెండు రోజులు రమ్యకృష్ణ ఆ షోను కవర్ చేసిన సంగతి తెలిసిందే.
ఫారిన్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన నాగార్జున ఈ వీకెండ్ మళ్లీ బిగ్ బాస్ షోలో సందడి చేశారు. ఈ షోకు హీరో నాని తన తాజా చిత్రం 'గ్యాంగ్ లీడర్' ప్రమోషన్ కోసం వచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున ఎడమ చేతిపై ఉన్న కొత్త టాటూ చూసి దాని గురించి ఆరా తీసే ప్రయత్నం చేశారు.

ఆ టాటూ గురించి నాగార్జున స్పందిస్తూ... ఇది నా 30వ బర్త్ డే(చత్కరిస్తూ) సందర్భంగా ఈ టాటూ వేయించుకున్నాను. నాకు నేనే గిఫ్టుగా దీన్ని వేయించుకున్నాను. ఇది నాగుపాము, పైన కంపస్, మధ్యలో నా కన్ను, పైన ఎన్ అని రాసి ఉండటం వెనక ప్రత్యేకమైన అర్థం ఉందన్నారు.
నేను ఎప్పుడూ కొత్తదనం వెతుకుతూ ఉంటాను అనేది ఈ టాటూ అర్థం. పైన 'ఎన్' అని రాసి ఉంది అది ట్రూ నార్త్ అవ్వొచ్చు లేదా నా పేరు కూడా అవ్వొచ్చు. ఫైనల్లీ హ్యాపీ నెస్ అనేది ఇక్కడే(హృదయం) ఉంటుంది. పాము పొలుసులు వదిలేసినట్లే నేను నా వెనక ఉన్న బ్యాగేజ్ అంతా వదిలేస్తాను అని అర్థం. గతం గత: అనే ధోరనితో ఉంటానని మీనింగ్ వస్తుందని నాగార్జున తెలిపారు.


Click it and Unblock the Notifications











