Ram Charan Birthday రామ్ చరణ్ బర్త్ డే.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన... ఏంటో తెలుసా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే నేడు. ఇక ఈ రోజు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు విషెష్ చెబుతున్నారు. ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన భార్య ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? రామ్ చరణ్ కు ప్రేమగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది ఉపాసన. ఆమె ఇచ్చిన గిఫ్ట్ గురించి స్వయంగా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్వులో చెప్పుకువచ్చారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్..

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ... నా దగ్గర చాలా గుర్రాలు ఉన్నాయి. అయితే నా బర్త్ డే సందర్భంగా ఉపాసన ఇచ్చిన గిఫ్ట్ మారిచిపోలేనిది. అది ఏంటో కాదు.. పోనీ ( గుర్రం) ని గిఫ్టుగా ఇచ్చింది. దాని వయసు 5 సంవత్సరాలు. అది ఇంట్లోనే పెరుగుతుంది. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు దాన్ని చూసి షాక్ అవుతారు. ఇప్పటికీ అది నా దగ్గరే ఉందని చెప్పుకువచ్చారు.

Do you know what Upasana presented ram Charan as birthday gift Full Details Here

రూమర్స్ కి చెక్...

ఇక సినిమా ఇండస్ట్రీలో వస్తున్న రూమర్స్ మీద కూడా ఆయన మాట్లాడారు. ఉపాసన తనకు మంచి ఫ్రెండ్ అని.. ఏ రోజూ మేం పెళ్లి, ప్రేమ గురించి ఆలోచించలేదు కానీ.. పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చింది. నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను. ఇక ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనకు అలాంటి థాట్ ఉందని అప్పుడే అర్థం అయింది. అలా ఇద్దరం అనుకున్నాక నాన్నకు చెప్పామంటూ వెల్లడించారు చరణ్.

ఉపాసనకు క్లారిటీ...

ఇక రామ్ చరణ్ ఫస్ట్ సినిమా హీరోయిన్ నేహ శర్మతో వచ్చిన రూమర్ గురించి కూడా స్పందించారు. తనతో పెళ్లైనట్లు రూమర్ వచ్చింది. అది విని నేను షాకయ్యాను. ఇంట్లో వాళ్లు మాత్రం నువ్వేం ఫీల్ అవ్వకు అలాగే వస్తాయని చెప్పారు. మొదటి సినిమాకే షాకింగ్ రూమర్ వచ్చిందంటూ చెప్పుకువచ్చారు. ఇక ఉపాసనకు ఇలాంటి విషయాల్లో క్లారిటీ ఉంది. ఆమెకు చెప్పాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

Do you know what Upasana presented ram Charan as birthday gift Full Details Here

వీడియో వైరల్...

నేను ఉపాసన ఫ్రెండ్స్ కాబట్టి.. నా గురించి ఉపాసనకు, తన గురించి నాకు బాగా తెలుసు. సో మా మధ్య అండర్ స్టాండింగ్ ఎక్కువ. ఎలాంటి విషయాల్లో మనస్పర్థలు రావు. నేను లక్కీ.. ఎందుకంటే.. నాకంటే ఎక్కువగా తనే ప్రేమిస్తుంది.. ఫ్రెండుగా తెలుసు.. కానీ భార్యగా నా ఫ్యామిలీకి వచ్చాక అందరితో కలిసిపోయారు. మా నాన్న గారు ఆమె ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు.. అంటూ చెప్పుకువచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

పాత వీడియో...

అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఇది ఇప్పటి వీడియో కాదు.. గతంలో ఉపాసన చెర్రీకి ఇచ్చిన గిఫ్ట్ పోనీ. రామ్ చరణ్ బర్త్ డే కావడంతో.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారిపోయింది. ఉపాసన చెర్రీ కోసం గుర్రాన్ని గిఫ్టుగా ఇచ్చిందని ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు. ఇక చెర్రీ బర్త్ డే రోజు.. క్లీంకార ఫోటో రివిల్ కావడం కూడా మరో విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X