Suhas: నా కొడుక్కి నేను పేరు పెట్టను.. అతడే ఆ పని చేయబోయేది.. ఎందుకంటే?
కలర్ ఫొటో హీరో సుహాస్ గురించి అందరికీ తెలిసిందే. చూసేందుకు నల్లగా ఉన్నా హీరో కావచ్చని నిరూపించిన ఈయన.. అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. కలర్ ఫొటో తర్వాత అద్భుతమైన సినిమాలతో వచ్చి రచ్చ చేసిన ఈయన తాజాగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో వచ్చి మరోసారి మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా ఈ సౌండ్ బాగా పేలడంతో సక్సెస్ మీట్లలో పాల్గొంటున్నాడు. ఈక్రమంలోనే ఆయన ఓ స్పెషల్ సర్ ప్రైజింగ్ విషయం చెప్పాడు. ఇటీవలే తండ్రి అయిన ఈయన తన కొడుక్కి పేరు పెట్టే అవకాశాన్ని ఓ డైరెక్టర్ కు ఇచ్చాడట. ఆ వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన సుహాస్.. తన అందం, అభినయంతో హీరోగా మారిపోయాడు. అద్భుతమైన నటనను కనబరుస్తూ.. అందరినీ కట్టిపడేస్తున్నాడు. కచ్చితంగా ఈయన స్టార్ హీరో అవుతాడనే కాన్ఫిడెన్స్ అందరిలో వచ్చేలా చేస్తున్నాడు. ప్రతీ సినిమాను చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటూ సూపర్ డూపర్ హిట్టు అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే తాజాగా ఆయన హీరోగా చేసిన చిత్రం అంబాజీపేట మ్యారేజీ బ్యాండుయే అందుకు నిదర్శనం.

ముఖ్యంగా తొలిసారి హీరోగా చేసిన కలర్ ఫొటో సినిమా మాత్రం ఆయనకు ఎప్పుడూ ప్రత్యకమే. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఆయన ఈ విషయాలను వెల్లడించాడు. ఎన్ని హిట్లు కొట్టిన తొలి చిత్రం ఎవరికైనా చాలా స్పెషల్ అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా కొడుకు పుట్టడం, సినిమా సక్సెస్ కావడం ఎలా అనిపిస్తోందని అనగా.. చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఒకేసారి రెండు గుడ్ న్యూస్ లు వింటే ఎవరికైనా గాల్లో తేలినట్లు అనిపిస్తుంది కదా అంటూ వివరించాడు.
మరి మీ బాబుకు ఏం పేరు పెట్టాలనకుంటున్నారని ఓ రిపోర్టర్ సుహాస్ ను అడగ్గా.. నేను నా బాబుకు పేరు పెట్టనని చెప్పాడు. తన బాబుకు పేరు పెట్టబోయేది తనను హీరో చేసిన కలర్ ఫొటో సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్ యేనని వివరించాడు. అతడికి ఎందుకు ఈ ఛాన్స్ ఇచ్చారని అడగ్గా.. నన్ను హీరో చేసింది వాడే, వాడి వల్లే నేను ఇంత సక్సెస్ అవుతున్నానను... అందుకే నా కొడుక్కి పేరు నువ్వే పెట్టాలని వాడిని అడిగానంటూ చెప్పుకొచ్చాడు.

2017లో సుహాస్... తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈయన భార్య లిఖిత ఇటీవలే ఓ పండంటి మగ బిడ్డకు జన్మను ఇచ్చింది. పెళ్లైన ఏడేళ్లకు వీరికి తొలి బిడ్డ పుట్టగా.. సుహాస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. ఇంతకాలం తర్వాత పుట్టిన తొలి బిడ్డకు పేరు పెట్టే అవకాశాన్ని తాను తీసుకోకుండా.. తనను హీరో చేసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడం నిజంగా గ్రేటే.


Click it and Unblock the Notifications











