Naga Chaitanya: మిథికల్ థ్రిల్లర్‌తో రాబోతున్న నాగ చైతన్య.. హీరోయిన్ ఎవరంటే?

అక్కినేని నాగ చైతన్య గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జోష్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈయన.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఆ మధ్య వరుసగా ఫ్లాపులు వచ్చినా దూత వెబ్ సిరీస్ తో సక్సెస్ సాధించాడు. అదే ఊపుతో తండేల్ సినిమా చేస్తున్నాడీ యంగ్ హీరో. ప్రస్తుతం చిత్రీకకరణ జరుపుకుంటున్న ఈ సినిమా పూర్తి కూడా కాకముందే నెక్స్ట్ సినిమాను లాక్ చేసుకున్నాడు.

విభిన్నమైన కథలకు మాత్రమే ఓకే చెబుతూ.. అన్ని చిత్రాలు హిట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎవరూ టచ్ చేయని పాయింట్ తో సరికొత్త కథాంశంతో రాబోతున్నారు ముఖ్యంగా మిథికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఆ సినిమా దర్శకుడు, హీరోయిన్.. టీంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Do you Know Who is the Heroine in Naga Chaitanya Next Mythical Thriller Movie

నాగచైతన్య ప్రస్తుతం సాయి పల్లవితో కలిసి తండేల్ సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రెండోసారి రాబోతున్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా పూర్తి కూడా కాకముందే తన నెక్స్ట్ చిత్రాన్ని లాక్ చేసుకున్నాడీ హీరో. అయితే విరూపాక్ష సినిమాతో వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కార్తీక్ వర్మ దండుతో కలిసి నాగ చైతన్య సినిమా చేయబోతున్నారు.

తన తదుపరి చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించబోతుండగా.. మిథికల్ థ్రిల్లర్ జోనర్ లో మూవీ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఆ హీరోయిన్ చైతో కలిసి ఓ సినిమా చేసింది. గతంలో ఒక లైలా కోసం సినిమాలో హీరోయిన్ గా చేసిన పూజా హెగ్డేనే ఈ సినిమాలో కూడా కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం.

Do you Know Who is the Heroine in Naga Chaitanya Next Mythical Thriller Movie

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్.. ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అలాగే అజనీష్ లోకనాథ్ సంగీతం అందించబోతున్నారు. మిథికల్ థ్రిల్లలర్ గా రాబోతున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా 2026లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని కూడా టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు నటిస్తారు, ఏ రేంజ్ లో తెరకెక్కిస్తారనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X