నువ్వే కావాలి సినిమాలో హీరో పాత్రను మిస్ చేసుకున్న కుర్రాడు ఎవరు, ఎందుకో తెలుసా?

నువ్వే కావాలి ఈ సినిమా పేరు చెబితే చాలా మంది తెగ బ్లష్ అవుతుంటారు. అద్భుతమైన కాన్సెప్ట్ తోవచ్చి అందరినీ తెగ అలరించిన ఈ చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ గా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందులోని పాటలు, మాటలు, డైలాగ్స్ ను ఇప్పటికీ జనాలు మర్చిపోలేకపోయారు. ముఖ్యంగా అనగనగనా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది పాట అయితే ఇప్పటికీ అందరికీ ఫేవెరట్ యే. అలాంటి సినిమాలో హీరోగా ముందుగా వేరే హీరోను అనుకున్నారట. కానీ అతడు నో చెప్పడంతో తురుణ్ కు ఈ ఛాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ఛాన్స్ వదులుకున్న ఆ కుర్ర హీరో ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2000ల సంవత్సరంలో కె విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తరుణ్, రిచా పల్లాడ్ హీరోహీరోయిన్లుగా నటించి మెప్పించారు. అలాగే అనేక మంది తారలు ఈ సినిమాలో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేశారు. సాయికిరమ్, సినీల్, ఎంఎస్ నారాయణ, గిరిబాబు, చలపతిరావు, కోవై సరళ, ఢిల్లీ రాజేశ్వరి, లైలా, శంకర్ మేల్కోటే, అన్నపూర్ణమ్మ ఇలా అనేక మంది టాలెంటెడ్ నటులు ఈ సినిమాలో పాత్రలకు ప్రాణం పోశారు. అందుకే ఆ సినిమా అంతలా హిట్టు ఇఇయింది.

Do You Know Who Missed The Chance in Nuvve Kavali Movie Hero Chance Check Details

ముఖ్యంగా హీరోగా తరుణ్ నటనను ఇప్పటికీ మనం మర్చిపోలేం. అయితే అంత చక్కగా నటించి మెప్పించిన ఈ అందగాడు ఈ సినిమాకు ఫస్ట్ హీరో కాదట. ముందుగా ఈ సినిమాలో యార్లగడ్డ సుమంత్ కుమార్ అలియాస్ సుమంత్ ను తీసుకోవాలని అనుకున్నారట. కానీ అతడికి ఈ సినిమా కథ నచ్చకపోవడంతో అతడు ఆసక్తి కనబర్చలేదట. ముఖ్యంగా ఇద్దరి స్నేహితుల మధ్య ప్రేమ.. చివరకు పెళ్లవడం సరిగ్గా ఉండేదేమో అని భావించిన అతడు ఈ సినిమాను చేయనని చెప్పాడట. అలా ఈ ప్రాజెక్టు తరుణ్ వద్దకు వెళ్లింది. ఆయన ఓకే చెప్పి సినిమా చేయగా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

Do You Know Who Missed The Chance in Nuvve Kavali Movie Hero Chance Check Details

సామాన్యంగా ఒక్కొక్కరికీ ఒక్కోలాంటి కథలు నచ్చుతాయి. అందులో ఏవి హిట్టు అవుతాయి, ఏవి ఫ్లాప్ అవుతాయని ఎవరూ చెప్పలేరు. మేకింగ్ విధానం బాగుంటే స్టోరీ అంతగా బాలేకపోయినా చాలా వరకు హిట్లుగా మారుతుంటాయి. ఓ మంచి స్టోరీని మిస్ చేసుకున్న సుమంత్ ఇప్పటికీ హీరోగానే కొనసాగుతున్నాడు. తనకు నచ్చిన, నప్పే సినిమాలే తీస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ అనుకున్న స్థాయిలో అవి హిట్లుగా నిలవడం లేదు. చూడాలి మరి ముందు ముందు అయినా ఆయన అద్భుతమైన సినిమాలతో వచ్చి హిట్లను ఖాతాలో వేసుకుంటారా లేదా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X