"నువ్వులేక నేను లేను" సినిమాలో హీరో పాత్ర మిస్ చేసుకున్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?
తరుణ్, ఆర్తీ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో ఒకటి నువ్వు లేక నేను లేను. 2002లో విడుదల అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అప్పట్లోని యువత మొత్తం ఈ సినిమాకు ఫ్యాన్స్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసే వాళ్లు చాలా ఎక్కువగానే ఉన్నారు. అద్భుతమైన కథతో వచ్చి అందరినీ అలరించిన ఈ సినిమాకు హీరోగా ఫస్ట్ ఛాయిస్ తరుణ్ కాదట. మరో స్టార్ హీరోను ఈ సినిమాలో హీరోగా తీసుకోవాలనుకోగా.. ఆయన నో చెప్పారట. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2002 జనవరి 24వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమాను వై కాశీ విశ్వనాథ్ తెరకెక్కించారు. తరుణ్, ఆర్తీ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా చేయగా.. కె.విశ్వనాథ్, శరత్ బాబు, చంద్రమోహన్, లయ, గుండు హనుమంత రావు, రాధా కుమారి వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్లుగా ఉన్న ఈ సినిమాలోని పాటలను ఆర్పీ పట్నాయక్ స్వరపరిచారు. అలాగే ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు నిర్మించారు.

అయితే రాధాకృష్ణ (తరుణ్), కృష్ణవేణి(ఆర్తి అగర్వాల్) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. వారి తల్లిదండ్రులు కూడా మంచి స్నేహితులు, కలిసి వ్యాపారం చేస్తారు. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే వీళ్ల తల్లిదండ్రులు చేస్తున్న వ్యాపారంలో సమస్య రావడంతో.. విశ్వనాథ్ సాయం చేస్తారు. అందుకుగాను హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ ను తన మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలని కోరతాడు. ఇలా తల్లిదండ్రుల కోసం వీరు ప్రేమను త్యాగం చేయాలనుకుంటారు.
ఇలా అయిష్టంగానే ఆర్తీ అగర్వాల్ కూడా విశ్వనాథ్ మనవడితో అయిష్టంగా పెళ్లికి ఒప్పుకుంటుంది. అయితే పెళ్లి ఏర్పాట్లు సాగుతుండగానే.. కుటుంబ సభ్యులు వీరి ప్రేమ విషయాన్ని గుర్తిస్తారు. చివరకు వీరి ప్రేమను అర్థం చేసుకుని.. వీరికి పెళ్లి చేసిస్తారు. ఇలా కథ సుఖాంతం అవుతుంది. ఇంత మంచి కథతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాలో హీరోగా ముందుగా తరుణ్ ను తీసుకోవాలని విశ్వనాథ్ అనుకోలేదట.

నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రం కథ వినగానే హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే బాగుంటుందని అన్నారట. అలా వెంటనే ఈ సినిమా ఆఫర్ తో మహేష్ బాబు వద్దకు వెళ్లగా ఆయన నో చెప్పారట. దీంతో మహేష్ బాబు డేట్ల కోసం వెయిట్ చేయడం చాలా కష్టం అని భావించిన డైరెక్టర్ విశ్వనాథ్... ఈ సినిమా కథకు తరుణ్ బాగా సరిపోతాడు.. ఆయనతోనే చేద్దామని అన్నారట. అలా తరుణ్ ను హీరోగా పెట్టి అనుకున్నట్లుగానే హిట్ కొట్టారు.


Click it and Unblock the Notifications











