స్టూడెంట్ నెం:1 సినిమాలో హీరో ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, గజాల హీరోహీరోయిన్లుగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన స్టూడెంట్ నెం:1 సినిమా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కథాంశంతో వచ్చి అందరినీ తెగ అలరించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ఛాయిస్ కాదట. మరో కుర్ర హీరోను పెట్టి ఈ సినిమా తీయాలనుకోగా ఆయన నో చెప్పారట. ఇలా ఈ సినిమా ఛాన్స్ తారక్ చేతికి వెళ్లడం.. అది బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడం జరిగిపోయింది. అయితే ఈ చిత్రంలో ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ స్టార్ నటుడు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2001వ సంవత్సరంలో.. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్టు సినిమానే స్టూడెంట్ నెం:1. అయితే ఈ సినిమాతోనే దర్శకధీరుడు జక్కన్న డైరెక్టర్ గా మారారు. 2001 సెప్టెంబర్ 27వ తేదీన విడుదల అయిన ఈ సినిమాను కె రాఘవేంద్ర రావు, అశ్వినీ దత్ లు నిర్మించారు. ఎన్టీఆర్, గజాల హీరోహీరోయిన్లుగా చేయగా.. మల్లాది రాఘవ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరాం, ఎమ్మెస్ నారాయణ, రాజీవ్ కనకాల, సుధ, స్వాతి, ప్రీతి నిగమ్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

Do You Know Who Missed The Chance in Stundent Number One Movie Check Details

అప్పట్లో 1.85 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా హిట్టుగా నిలిచి.. రూ.12 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇలా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో జైలునుండి వచ్చి చదివి లాయరవుతాడు హీరో. కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఆయన జైలు పాలవుతాడు. ఆ తర్వాత లాయర్ గా మారిన హీరో.. ఓ తప్పుడు కేసులో చిక్కుకున్న తన తండ్రిని ఎలా విడిపించడన్నదే అసలు కథ. ఇలా తండ్రీ, కొడుకుల ఎమోషన్ తో పాటు.. అదిరిపోయే కాలేజీ వాతావరణం, స్నేహితుల మధ్య ఫ్రెండ్ షిప్ ను కూడా చక్కగా చూపించారు.

ఇలా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మాస్ యాంగిల్ మరింత ప్లస్ అయింది. అయితే ఈ సినిమాకు తారక్ ను హీరోగా అనుకోలేద. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను హీరోగా పెట్టి సినిమాను చేయాలనుకున్నారట. కానీ ప్రభాస్ ను అడిగితే ఈ సినిమా చేయనని చెప్పారట. కారణం ఏంటో తెలియకపోయినప్పటికీ.. ఆయన మాత్రం చేయలేకపోయారట. ఆ తర్వాత ఇదే కథను జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించగా.. ఆయన ఓకే చేశారట. అలా ఆయన సినిమాతో సినిమాను తెరకెక్కించారట.

Do You Know Who Missed The Chance in Stundent Number One Movie Check Details

అయితే ఈ విషయాన్ని నేరుగా.. అశ్వినీ దత్ కుమార్తె స్వప్న దత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు ప్రభాస్ తో ఇప్పటి వరకు కలిసి పని చేయలేదు కదా అనగా.. ఓసారి చేయాల్సి వచ్చింది కానీ ఆయన నో చెప్పడం వల్ల చేయలేకపోయానని క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ సినిమా మరేదో కాదు.. స్టూడెంట్ నెం:1 అని కూడా వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X