గీతాగోవిందం సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా గీతా గోవిందం. ఈ సినిమాకు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా విజయ్ ఈ చిత్రంలో.. మేడమ్ మేడమ్ అంటూ హీరోయిన్ వెనుక తిరిగే సీన్ అయితే అద్భుతం అనే చెప్పాలి. అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాలో ముందుగా హీరోగా ఓ స్టార్ హీరోను అనుకున్నారట. కానీ ఆయన నో చెప్పడంతో విజయ్ దేవరకొండకు ఈ అవకాశం వచ్చింది. మరి ఇంత మంచి సినిమాను వదులుకున్న ఆ హీరో ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
డైరక్టర్ పరుశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ అద్భుతమైన ప్రేమ కథను.. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు. గోపీ సుందర్ స్వరాలు సమకూర్చగా... విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలతో పాటు నిత్య మేనన్, సుబ్బరాజు, నాగబాబు, మౌర్యాని, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, నవీన్ బేతిగంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రం వల్లే విజయ్ కు విపరీతమైన గుర్తింపు వచ్చింది.

అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇలా ఇందులో నటించిన ప్రతీ ఒక్కరికీ మంచి గుర్తింపు రాగా.. పాటలు కూడా ఆల్ టైమ్ హిట్లుగా నిలిచాయి. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే, వచ్చిందమ్మా వచ్చిందమ్మా పాటలు అయితే చాలా మందికి ఆల్ టైమ్ ఫెవరెట్ సాంగ్స్ గా నిలిచాయి. ఇలా అన్ని రకాలుగా అద్భుతాలు చేసిన ఈ సినిమాకు హీరోగా మొదటి ఛాన్స్ విజయ్ దేవరకొండ కాదట.
ముందుగా డైరెక్టర్ పరుశురాం ఈ సినిమా కథను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు వినిపించాడట. ముఖ్యంగా సరైనోడు సినిమా రిలీజ్ తర్వాత చెప్పగా.. బన్నీ పెద్దగా ఆసక్తి చూపించలేదట. రాంగ్ టైంలో చెప్పకపోయుంటే కచ్చితంగా అల్లు అర్జున్ యే ఈ సినిమా హీరోగా చేసేవారని వివరించారు. ఆ తర్వాత కూడా ఈ సినిమా కథ గురించి మాట్లాడుతూ.. చేసేయాలి, చేసేయలి.. ఇలాంటి కథ మళ్లీ వస్తుందో రాదో అంటూ అన్నారట. అప్పటికే విజయ్ ను సెలెక్ట్ చేసుకున్న పరుశురాం చాలా భయపడిపోయారట.

ఎక్కడ అల్లు అర్జున్ ఈ సినిమా చేస్తానని అంటారేమో అని తెగ టెన్షన్ పడిపోయారట. కానీ చివరకు ఈ సినిమా కోసం హీరోహీరోయిన్లు సెలెక్ట్ చేసేందుకు ఆయనే కొన్ని పేర్లు ఇవ్వడం.. హీరోయిన్లకు ఫోన్ లు చేసి ఈ సినిమా చేయమని చెప్పడం వంటివి కూడా చేశారట. అయితే హిట్ అవుతుందని ముందు భావించినా ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుందని మాత్రం ఎవరూ అనుకోలేదట. కానీ చివరకు విజయ్, రష్మికల కాంబోలో వచ్చిన ఈ సినిమా తన లైఫ్ నే మార్చేసిందని డైరెక్టర్ పరుశురాం వెల్లడించాడు.


Click it and Unblock the Notifications











