Hero Tharun: హీరో తరుణ్ సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం అదేనట..!
ఒకప్పుడు తెలుగు సినీ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో తరుణ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమై టాలెంట్ కల్గిన ఈయన అదిరిపోయే సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. బాలనటుడిగా పలు సినిమాల్లో కనిపించిన ఈయన ఆ తర్వాత హీరోగా కూడా సక్సెస్ అందుకున్నాడు. 10 ఏళ్ల పాటు మంచి చిత్రాలు చేసిన ఈయన ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. అయితే ఎందుకు తరుణ్ సినిమాలు చేయడం మానేశాడో.. ఎంఎస్ నారాయణ కొడుకు ఎంఎస్ విక్రమ్ తొలిసారి వివరించారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నటి రోజారమణి కొడుకు అయిన తరుణ్.. 1990లో అంజలి సినిమాలో బాల నటుడిగా చేశాడు. కేవలం ఏడేళ్ల వయసులోనే ఈ సినిమా చేసిన తరుణ్.. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దళపతి, ఆదిత్య 369, గౌరమ్మ, తేజ, సాహసం వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. ఇలా 1992 తర్వాత గ్యాప్ ఇచ్చిన ఈయన 2000 సంవత్సరంలో హీరో నువ్వే కావాలి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ఆ తర్వాత వరసుగా అవకాశాలు వచ్చాయి.

అలా అంకుల్, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, చిరుజల్లు, నువ్వే నువ్వే, అదృష్టం, నిన్నే ఇష్టపడ్డాను, సఖియా, సోగ్గాడు, నవ వసంతం, భలే దొంగలు, శశిరేఖా పరిణయం, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి వంటి చిత్రాల్లోనూ హీరోగా కనిపించి తెలుగు సినీ ప్రియుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. 2011 తర్వాత నుంచి ఈయన ఏ ఒక్క చిత్రంలోనే కనిపించలేడు. అయితే ఈయన సినిమాలు చేయడం ఎందుకు ఆపేశాడో చాలా మందికి కారణం తెలియదు. ఏళ్లపాటు హీరోలుగా కొనసాగుతున్న చాలా మంది టాలెంట్ కు ఏమాత్రం తక్కువ కాని ఈయన ఎందుకు సినిమాలు చేయట్లేదో ఓ స్టార్ కమెడియన్ కొడుకు తెలిపాడు.
ఎంఎస్ నారాయణ కొడుకు అయిన ఎంఎస్ విక్రమ్ తొలిసారి తరుణ్ సినిమాలు చేయడం ఎందుకు ఆపేశారో వివరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. తరుణ్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. అద్భుతమైన టాలెంట్ కల్గిన తరుణ్ కు బ్యాగ్రౌండ్ కూడా ఉన్నప్పటికీ.. ఓ దశలో అవకాశాలు అస్సలే రాలేదని వివరించారు. చాలా మంది బ్యాగ్రౌండ్ ఉంటేనే వస్తాయని అనుకుంటారని కానీ అదంతా అవాస్తవం అని విక్రమ్ చెప్పుకొచ్చారు. అందుకు బెస్ట్ ఉదాహరణ తరుణ్ యే అని చెప్పుకొచ్చారు. టాలెంట్ తో పాటు బ్యాగ్రౌండ్ ఉన్నా అవకాశాలు లేకే ఆయన సినిమాలు చేయట్లేదని వివరించారు.

ప్రతీ ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుందని.. అందువల్లే తాము చేసే ఉద్యోగాలు, బిజినెస్ లు వదులుకుని మరీ సినీ రంగంలోకి వస్తారని చెప్పుకొచ్చారు. కానీ అదృష్టం, అవాకాశాలు లేకే ఎటూ కాకుండా పోతారని.. అలాంటి పరిస్థితిని ఎదుర్కున్న వాళ్లలో తరుణ్, వరుణ్ సందేశ్ వంటి వాళ్లు చాలా మందే ఉన్నారని వివరించారు.


Click it and Unblock the Notifications











