Jr.NTR: 10 లక్షలు పెట్టి అయినా ఎన్టీఆర్ తన కార్లకు 9999 నంబర్ ఎందుకు కొంటాడో తెలుసా?
నందమూరి తారకరామా రావు మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని గ్లోబర్ స్టార్ గా ఎదిగాడు. ఇక చిన్నప్పుడే బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్... ఇప్పుడు స్టార్ హీరో అయిపోయారు. అయితే ఎన్టీఆర్ కు ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన తన కార్లకు 9999 నెంబర్ ప్లేట్ ని ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే తీసుకుంటారు. అయితే ఆ నంబర్ వెనుక ఎన్టీఆర్ కు ఓ సెంటిమెంట్ ఉందట. ఆ వివరాల్లోకి వెళితే...
జూనియర్ ఎన్టీఆర్.. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ప్రపంచ దేశాల్లో ఆయనకు ఫ్యాన్స్ కూడా అయిపోయారు. కొమురం భీంగా ఆయన చేసిన పాత్ర ఎంతో మందిని అలరించింది. ఎంతో ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపించారు.

ఇక ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. అలా తారక్ కి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఎన్టీఆర్ కార్లను పరిశీలిస్తే.. ఆయన కార్లకు 9999 నంబర్ ఉంటుంది. ఆయన అన్ని కార్లకు ఈ నంబర్ ప్లేట్ నే తీసుకుంటారు. 9999 నంబర్ వెనుక ఓ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది. ఎంత ఖర్చు పెట్టి అయినా సరే ఆ నంబర్ ఎన్టీఆర్ తీసుకోవడంలో పెద్ద కథే ఉందని సమాచారం.
ఎన్టీఆర్ తన కార్లకు 9999 నంబర్ ప్లేట్ ఎందుకు తీసుకుంటారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన ప్రకారం.. తారక్ తాత సీనియర్ ఎన్టీఆర్ బతికున్న సమయంలో ఆయన తన కారుకి ఇదే నెంబర్ ని ఉపయోగించారని చెప్పుకొచ్చారు. అలాగే మా నాన్న హరికృష్ణ కూడా ఇదే నెంబర్ ని ఫాలో అయ్యాడు. అందుకే నాకు కూడా వారిద్దరి లాగే ఈ నెంబర్ అనేది కాస్త సెంటిమెంట్ గా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు.
ఇక ఎన్టీఆర్ కూడా తన తాత, నాన్న సెంటిమెంట్ ను ఫాలో అవుతూ... తన కార్లకి 9999 అనే నెంబర్ ప్లేట్ ని పెట్టుకుంటాడని తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ కు 9 నెంబర్ అంటే చాలా ఇష్టమట. అందుకే దీన్ని ఫాలో అవుతున్నట్లు ఓ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒక్క ఎన్టీఆర్ కే కాదు... చిరంజీవికి కూడా...ఈ సెంటిమెంట్ ఉందట. ఆయన కూడా తన ప్రతి ఒక్క కారుకి 1111 నెంబర్ ఉండే నెంబర్ ప్లేట్ నే తీసుకుంటారని సమాచారం.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన మొదటి సారిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ వార్ 2 చిత్రంలోనూ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ తలపడున్నారు.


Click it and Unblock the Notifications











