గోదావరి సినిమాలో హీరో ఛాన్స్ మిస్ చేసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా?

గోదావరి.. ఓ చల్లటి సినిమా అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అద్భుతమైన కథతో వచ్చి అందరినీ తెగ అలరించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ.. ఆ గోదావరి పడలో ప్రయామం చేసిన ఫీలింగ్ కచ్చితంగా వస్తుంది. అలాంటి ఈ క్రేజీ సినిమా సుమంత్, కమిలినీ ముఖర్జీలు హీరోహీరోయిన్లుగా విపరీతమైన క్రేజ్ అందుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా ముందుగా పవన్ కల్యాణ్ ను తీసుకోవాలనుకున్నారట. కానీ ఆయన ఈ చిత్రానికి నో చెప్పారట. ఎందుకు చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ది గ్రేట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన క్రేజీ సినిమానే గోదావరి. 2006లో వచ్చిన ఈ సినిమాలో చాలా భాగం గోదావరి నది, పాపికొండల ప్రాంతంలో చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ సినిమాలో సుమంత్, కమలినీ ముఖర్జీలు హీరోహీరోయిన్లుగా నటించగా.. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో నీతు చంద్ర, కమల్ కామరాజు, తనికెళ్ల భరణి, మధ మని, గంగాధర్ పాండే, సీవీఎల్ నరసింహారావు, కరాటే కల్యాణీ, నటకుమారి కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

Do You Know Why Power Star Pawan Kalyan Reject Godavari Movie Check Details

అలాగే ఈ సినిమాను జీ.వి.జి రాజు నిర్మించగా.. కె. ఎం రాధాకృష్ణ సంగీతం అందించారు. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. సినిమాతో పాటు అందులోని పాటలు కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఉప్పొంగెలే గోదావరి, మనసా వాచా, తిప్పల తప్పులు, మనసా గెలుపు, అందంగా లేనా, రామ చక్కని సీతకు వంటి పాటలు అయితే ఇప్పటికీ చాలా మందికి హాట్ ఫేవరెంట్. అద్భుతమైన సినిమాకు తోడు చక్కని పాటలు ఉన్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అయితే అందరికీ జీవితాంతం గుర్తుండిపోయే ఈ సినిమాలో హీరోగా సుమంత్ చేశారు. కానీ ఈ సినిమాలో హీరోగా ముందుగా వేరే స్టార్ నటుడిని తీసుకోవాలని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అనుకున్నారట. అదే విషయం ఆయనతో చెప్పి సినిమా కథను కూడా వినిపించారట. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఈ సినిమా చేయలేనని వివరించారట. తనకు వేరే సినిమాలు ఉండడం.. చాలా బిజీగా ఉండడంతో చేయలేనని స్పష్టం చేశారట.

Do You Know Why Power Star Pawan Kalyan Reject Godavari Movie Check Details

ఆ తర్వాత కూడా డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. వేరే హీరోలను అప్రోచ్ అయ్యారట. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు.. గోపీచంద్ ను కూడా అడిగారట. కానీ వాళ్లిద్దరికీ కూడా డేట్లు ఖాళీ లేకపోవడంతో.. ఈ సినిమాకు వాళ్లు కూడా నో చెప్పారట. అలా ఈ ముగ్గురు హీరోలు ఆ అవకాశం వదులుకోగా.. సుమంత్ కు ఛాన్స్ వచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న సుమంత్ చక్కగా వాడుకొని బాగా నటించగా.. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X