twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    60 వడిలో నాగార్జున.. మన్మధుడి వైభవం మసక బారుతోందా?

    |

    టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు నేడు. గతంలో మాదిరి కాకుండా ఇది ప్రత్యేకమైన పుట్టినరోజు. నేటితో ఆయన 60వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ వయసులోనూ మన్మధుడిగా ఇండస్ట్రీలో వెలుగొందుతుండటం కేవలం ఆయనకు మాత్రమే చెల్లింది అని చెప్పక తప్పదు.

    అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగార్జున 1986 మే 23న వచ్చిన 'విక్రం' అనే సినిమా ద్వారా నటుడిగా తన ప్రయాణం మొదలు పెట్టారు. వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ.. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'శివ' లాంటి ట్రెండ్ సెట్టర్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగారు.

    అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన నాగార్జున

    అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన నాగార్జున

    లవ్ స్టోరీస్, యాక్షన్ మూవీస్, కుటుంబ కథా చిత్రాలు, కమర్షియల్, డివోషనల్ మూవీస్ ఇలా అన్ని జోనర్లలో నాగార్జున తనదైన ముద్ర వేశారు. శివ, గీతాంజలి, హలో బ్రదర్, అల్లరి అల్లుడు, మన్మధుడు, అన్నమయ్య, శ్రీరామదాసు ఇలా ఎన్నో విజయాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు.

    ఈ వయసులోనూ మన్మధుడిగా

    ఈ వయసులోనూ మన్మధుడిగా

    ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిన్నటి తరం నుంచి నేటి తరం వరకు మహిళా ప్రేక్షకులు ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న స్టార్‌గా నాగార్జున గుర్తింపు తెచ్చుకున్నారు. 60 ఏళ్ల వయసులోనూ ఆయన నవ మన్మధుడిలా ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ ఈ జనరేషన్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

    రేసులో వెనకబడిపోయిన నాగ్

    రేసులో వెనకబడిపోయిన నాగ్

    ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్‌గా అమ్మాయిల మనసు దోచే మన్మధుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున క్రమక్రమంగా ఇండస్ట్రీలో తన ప్రాభవాన్ని కోల్పోతున్నరా? అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది. ఈ మధ్య కాలంలో ఆయన బాక్సాఫీస్ రేసులో వెనక పడిపోవడమే ఇందుకు కారణం.

    బాక్సాఫీస్ వద్ద మన్మధుడి వైభవం తగ్గుతోందా?

    బాక్సాఫీస్ వద్ద మన్మధుడి వైభవం తగ్గుతోందా?

    బాక్సాపీస్ వద్ద నాగార్జున వరుస అపజయాలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల విడుదలైన ‘మన్మధుడు 2', గతేడాది వచ్చిన ‘ఆఫీసర్' చిత్రాలు ప్రేక్షకుల తిరస్కరణకు గురయ్యాయి. మరికొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఈ అక్కినేని స్టార్ వైభవం తగ్గుతోంది అనే అభిప్రాయం బలపడుతోంది.

    అలా చేస్తే పూర్వ వైభవం సాధ్యమే

    అలా చేస్తే పూర్వ వైభవం సాధ్యమే

    నాగార్జున బాక్సాఫీస్ రేసులో వెనకబడటానికి కారణం సరైన కథలు ఎంపిక చేసుకోకపోవడమే అనే వాదన వినిపిస్తోంది. తన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి కథతో వస్తే వారిని మెప్పిప్పింగలము అనే విషయంలో సమాలోచనలు చేసి సగటు ప్రేక్షకుడి పల్స్ పట్టుకోగలిగితే నాగార్జునకు పూర్వ వైభం సాధ్యమే. నాగార్జున మళ్లీ అలాంటి వైభవం అందుకోవాలని ఆశిస్తూ 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు.

    English summary
    Does Nagarjuna fame shrink in Tollywood?. Nagarjuna is celebrating his 60th birthday today. Once entertained with success. But the last two years have been a series of failures.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X