ఆయన్ను పోలీసులు ఏమీ చేయరా? ప్రశ్నించిన మహిళ... హీరో రాజశేఖర్ రిప్లై!

Recommended Video

Netizen Fires On Hero Rajasekhar & Hyderabad Police, Rajasekhar Replies To Her Post || Filmibeat

ట్రాఫిక్ నిబంధనల విషయంలో హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోర్టు నుంచి నుంచి కూడా ఆదేశాలు ఉండటంతో ఈ మధ్య కాలంలో తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే ట్రాఫిక్ పోలీసులు తమ ప్రతాపం సామన్యులపై చూపిస్తున్నారే తప్ప... వేలకు వేలు చలాన్లు ఎగ్గొట్టి తిరుగుతున్న రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలను ఏమీ అనడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి. తాజాగా ఓ ఆంగ్లపత్రికలో హీరో రాజశేఖర్ పేరు మీద రూ. 18 వేల చలాన్లు పెండింగులో ఉన్నట్లు కథనం రావడంపై పలువురు నెటిజన్లు స్పందించారు.

ఆయన్ను పోలీసులు ఏమీ చేయరా? అంటూ ప్రశ్నించిన మహిళ...

హీరో రాజశేఖర్ లాంటి సెలబ్రిటీలు వేలకు వేలు ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారు. అతి వేగంగా వెళుతూ నిబంధనలు అతిక్రమిస్తున్నారు, ఇలాంటి వారిని పోలీసులు ఏమీ చేయరా? అంటూ ఓ మహిళ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రాజశేఖర్ ఏమని రిప్లై ఇచ్చారంటే..

సదరు మహిళ ట్వీట్‌పై హీరో రాజశేఖర్ వెంటనే స్పందించారు. తాను చలాన్లు ఎప్పుడూ కడుతూనే ఉన్నాను. గతంలో కట్టాను, ఇకపై కడతాను, భవిష్యతులో వీలైనంత వరకు చలాన్లు పడకుండా చూసుకుంటాను. ప్రస్తుతం నా పేరుపై ఎలాంటి చలాన్లు పెండింగులో లేవు. ఎవరైనా తప్పు చేస్తే తప్పించుకోలేరు.... అని రాజశేఖర్ ట్వీట్ చేశారు. ఎవరూ బాధ పడొద్దు, నేను ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం లేదు, నేను నా చలాన్లు కడుతున్నటట్లు ట్వీట్ చేశారు.

రాజశేఖర్ మీద ప్రశంసలు

రాజశేఖర్ మీద ప్రశంసలు

తన చలాన్ల విషయాన్ని నిజాయితీగా ఒప్పుకున్న రాజశేఖర్ మీద పలువురు నెటిజన్లు పశంసలు గుప్పించారు. మీరు స్పందించిన విధానం చాలా కూల్‌గా ఉందని, మీపై విమర్శలు చేసిన వారిని దుర్భాషలాడకుండా మాట్లాడటం కానీ, తప్పించుకునే ప్రయత్నం కానీ చేయలేదని, చాలా తక్కువ మంది మీలా ఉంటారు.... అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

కొంతమంది రివర్స్ పంచులు

కొంతమంది రివర్స్ పంచులు

భవిష్యత్తులో కూడా మీరు అవసరం అయితే చలాన్లు కడతామని అంటున్నారు. అంటే మీరు రూల్స్ బేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? థాంక్స్ అంకుశం రాజశేఖర్ గారు అంటూ కొందరు రివర్స్ పంచులు వేస్తుండటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X