దటీజ్ చిరంజీవి.. మీరు మెగాస్టార్‌కు దగ్గర కావాలంటే ఏం చేయాలో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో అందరివాడు అనే పేరుంది. ఎంతో సౌమ్యుడైన ఆయనంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. కానీ అలాంటి సూపర్ స్టార్ కు దగ్గరవ్వడం అనే విషయాన్ని కలలో కూడా ఊహించలేము. కానీ ఓ క్వాలిటీ ఉంటే మాత్రం చిరుకు ఈజీగా దగ్గరవ్వొచ్చు. మరి మెగాస్టార్ కు ఎవ్వరినైనా దగ్గర చేసే ఆ మెయిన్ క్వాలిటీ ఏంటి అనే ఇంటెస్టింగ్ విషయాన్ని తెలుసుకోవాలంటే కంటెంట్ లోకి వెళ్దాం పదండి.
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమందికి అభిమానం, మరెంతో మందికి ఆదర్శం కూడా. మరి అలాంటి మెగాస్టార్ కు దగ్గర అవ్వాలంటే మామూలు విషయమా? కానీ ఒక్క క్వాలిటీ ఉంటే మాత్రం ఆయనకు ఇట్టే దగ్గరైపోవచ్చు అని సమాచారం.

స్వయంకృషితో ఎదిగి నేడు మెగాస్టార్ గా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు చిరంజీవి. పేరుకు తగ్గట్టుగానే ఆయన ఇప్పటిదాకా చేసిన సినిమాలు, మంచి పనులతో తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారయన. ఇక మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చినా, స్వయంగా ఆయన తనయుడే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయినప్పటికీ మెగాస్టార్ పై ఉన్న అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదు తెలుగు సినీ ప్రియులకు.
దానికి కారణం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన వ్యక్తిత్వం, నలుగురికి సాయం చెయ్యాలనే గుణం. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది ఇండస్ట్రీ వారు ఆయననే పెద్దదిక్కుగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరేమన్నా, చిరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే మాకు పెద్దదిక్కు అంటూ ఉంటారు.

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు తనకు చేతనైన సాయం చేస్తూ ఉంటారు చిరంజీవి. మరి కోట్ల మంది అభిమానుల మనసుల్లో స్థానం దక్కించుకున్న చిరంజీవితో సన్నిహితంగా మెలగాలనే కోరిక ఎవరికి ఉండదు? కానీ అదంత ఈజీగా తీరే కోరిక మాత్రం కాదు. ఆ ఒక్క క్వాలిటీ ఉంటే తప్ప అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.
ట్యాలెంట్ ఉండి కష్టపడి పని చేసే వాళ్లను చిరంజీవి బాగా ఎంకరేజ్ చేస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా హనుమాన్ హీరో తేజా సజ్జకు ఆయన ఎంత సపోర్ట్ చేశారో అందరికీ తెలిసిందే. ఇతరులపై ఆధారపడకుండా, స్వయంకృషిని నమ్ముకుని కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరిని చిరు చేరదీస్తారని, ఆయనకు దగ్గర అవ్వాలంటే అదొక్కటే మార్గమని అంటూ ఉంటారు సినీ ఇండస్ట్రీలోని కొంతమంది.
దానికి సాక్ష్యంగా చిరంజీవి ఇప్పటిదాకా ఎంతమంది చిన్న, మిడ్ రేంజ్ హీరోలకు, అప్ కమింగ్ డైరెక్టర్లకు దగ్గరుండి సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా అండగా నిలిచారు. అక్కున చేర్చుకున్నారు.
ఇక ప్రస్తుతం చిరు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే మూవీ చేస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది.


Click it and Unblock the Notifications











