నాకు, జీవితకు ఆ వీక్‌నెస్.. జీవితంలో ఎంతో కోల్పోయాం.. హీరో రాజశేఖర్‌ ఆవేదన

టాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్‌మెన్‌గా, పవర్‌ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు డాక్టర్ రాజశేఖర్. తమిళ నటుడే అయినా తన కష్టం, ప్రతిభతో తెలుగునాట స్టార్ హీరోగా ఎదిగారు రాజశేఖర్. పోలీస్ రోల్స్‌తో పాటు యాక్షన్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేశారు రాజశేఖర్. తన నటనతో టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లకు గట్టి పోటీ ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఆయన రేసులో వెనుకబడ్డారు. ఆయన హిట్ కొట్టి ఏళ్లు గడుస్తోంది. త్వరలో బైకర్ మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని కీలక విషయాలు, కెరీర్‌పై కీలక విషయాలు వెల్లడించారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
66 ఏళ్ల వయసులో తల్లికాబోతోన్న హీరోయిన్? ఈ ఏజ్‌లోనూ అది కావాలంటూ నటి రియాక్షన్
66 ఏళ్ల వయసులో తల్లికాబోతోన్న హీరోయిన్? ఈ ఏజ్‌లోనూ అది కావాలంటూ నటి రియాక్షన్

ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు 23 రోజులు వెళ్లాను. అక్కడ ఎక్కువగా సినిమాటోగ్రఫి, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన స్టూడెంట్స్ కొన్ని సినిమాలు తీసేవారు. అలా వాళ్ల సినిమాలకు నన్నేహీరోగా సెలెక్ట్ చేసుకునేవారు. ఒకేరోజు ఇద్దరి నుంచి నాకు పిలుపొచ్చింది. మీరే హీరో షూటింగ్‌కి వచ్చేయండి అన్నట్లుగా మాట్లాడారు. డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నవారు సినిమా మొదలుపెట్టారు. తర్వాత భారతీరాజా గారి నుంచి కబురొచ్చింది. ఆఫీసుకు వెళ్తే ఆయన లేరు..కానీ నా మీద మంచి ఓపీనియన్ ఉన్నట్లు అక్కడివారు చెప్పారు. అటువైపు వెంటనే మరో సినిమాకు షూటింగ్ మొదలైపోయింది. అయితే భారతీరాజా చేతుల మీదుగా లాంచ్ అయితే కెరీర్ బాగుంటుందని అనుకున్నా. వెంటనే ఆయన స్టే చేసిన హోటల్‌కు ఫోన్ చేసి విషయం చెబితే... మరో సినిమా షూటింగ్‌కు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. దాంతో హ్యాపీగా షూటింగ్‌లో పాల్గొంటున్నా.. అయితే వారం తర్వాత భారతీరాజా దగ్గరికి వెళితే ఎందుకొచ్చారు అని ప్రశ్నించారు. నేనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నా.. మీరు ఇంకో సినిమాకు వెళ్లానా? వద్దా అని నన్నే అడిగితే ఏం చెబుతానని భారతీ రాజా ప్రశ్నించారని రాజశేఖర్ గుర్తుచేసుకున్నారు.

Dr Rajasekhar Opens Up About Career Bharathiraja Movie Ankusham Success and Upcoming Biker Film

భారతీరాజా కుదరదని చెప్పేయడంతో అక్కడి నుంచి వచ్చేసి నేను కమిటైన సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నా. ఆ తర్వాత మళ్లీ భారతీరాజా నుంచి ఫోన్ వచ్చింది. నా సినిమాలో విలన్‌గా చేస్తారా అని అడిగారు. నా సినిమానే ఫస్ట్ వస్తుంది.. ఆ సినిమా ఆపేసి నా మూవీలో నటించాలని తేల్చిచెప్పారు. ఇదే విషయం వేరే దర్శకుడితో చెబితే ఆయన కూడా సంతోషించి.. భారతీరాజా గారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీరు మా సినిమాలో ఉంటే బాగుంటుందని అన్నారు. ఆ సినిమా రిలీజై మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో నన్ను చూసిన దర్శకుడు టీ. కృష్ణగారు వందేమాతరం అనే సినిమాకు హీరోగా బుక్ చేసుకున్నారు. భారతీరాజా గారి సినిమా తర్వాత చాలా మంది నన్ను విలన్‌గా చేయమని అడిగారు. కానీ నేను చేయలేదు. వందేమాతరం, ప్రతిఘటన వంటి హిట్ సినిమాలతో నిలబడిపోయాను. బైకర్ మూవీ సబ్జెక్ట్ వినగానే.. నేను కొత్తగా చేయగలను అని ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని రాజశేఖర్ అన్నారు.

Recommended For You
'అలా నన్ను లొంగదీసుకుని.. రాత్రి 9 దాటితే.. ఆ కోరిక తీర్చుకోవాల్సిందే’
'అలా నన్ను లొంగదీసుకుని.. రాత్రి 9 దాటితే.. ఆ కోరిక తీర్చుకోవాల్సిందే’

తలంబ్రాలు మూవీలో నేను, జీవిత కలిసి నటించాం. ఈ సినిమాలో నేను విలన్.. జీవితే హీరో, హీరోయిన్. చివరిలో జీవిత నన్ను కాల్చి చంపేస్తుంది. అంత క్రూరంగా నటించాను. సినిమా ప్రివ్యూ చూశాక.. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయం వేసింది. సినిమా రిలీజ్ అయ్యాక నన్ను తిట్టుకోలేదు.. థియేటర్‌లో నుంచి వస్తుంటే కొందరు ముద్దుకూడా పెట్టుకున్నారు. విలన్‌గా బాగా చేశారు కానీ మళ్లీ ఇలాంటి రోల్స్ చేయొద్దని లేడీ ఫ్యాన్స్ చెప్పారు. అంకుశం సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడే ఈ మూవీ తమిళ్ రైట్స్ కొనుక్కున్నా. ఆంధ్రాలో ఈ సినిమా బాగా ఆడటంతో తమిళంలో మంచి ఆఫర్స్ వచ్చాయి. ఒక దశలో 25 లక్షల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారు. అయినప్పటికీ నేను అమ్మకుండా నేనే దగ్గరుండా డబ్ చేసి రిలీజ్ చేశా. భారీ వసూళ్లతో రజనీకాంత్ సినిమా రికార్డ్స్‌ని కూడా అంకుశం బ్రేక్ చేసింది. అంకుశం రిలీజ్‌కు ముందు పెద్ద యాక్సిడెంట్ అయి ఎడమకాలుకు పెద్ద గాయమై ఎన్నో రోజులు ఆసుపత్రిలో ఉన్నానని డాక్టర్ రాజశేఖర్ గుర్తుచేసుకున్నారు.

You May Also Like
'సుఖం కోసం హీరోయిన్లకు అలాంటి చాక్లెట్లు... కాంప్రమైజ్ అడిగితే కట్ చేయడమే’
'సుఖం కోసం హీరోయిన్లకు అలాంటి చాక్లెట్లు... కాంప్రమైజ్ అడిగితే కట్ చేయడమే’

రెమ్యునరేషన్ అడగటంలో నేను చాలా వీక్. సినిమా, క్యారెక్టర్ మాత్రమే నేను చూసుకునేవాడిని. మిగిలిన విషయాలు నా తమ్ముళ్లు చూసుకున్నారు, తర్వాత జీవిత చూసుకుంది తప్ప నేను ఎప్పుడూ రెమ్యునరేషన్ గురించి డిస్కస్ చేసింది లేదు, డబ్బులు గురించి చూసింది లేదు. నాకు ఏమన్నా కావాలంటే డబ్బులు అడిగి తీసుకుంటాను. ఎప్పుడైనా ఫారిన్ ట్రిప్ వెళ్లినప్పుడు బ్యాగ్‌ని కరెక్ట్‌గా కట్టుకుని డాలర్స్ మార్చుకుని లెక్కపెట్టేవాడిని తప్ప ఎప్పుడు లేదు. రెమ్యునరేషన్ తదితర విషయాలపై జీవిత మాట్లాడుతుంది కానీ మేమిద్దరం ఆ విషయంలో చాలా వీక్. చాలా మంచిగా ఉండి దాని వల్ల చాలా నష్టపోయాం.. అయినా పర్లేదని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X