డ్రీమ్ హాలిడే ముగిసింది, బ్యాక్ టు లైఫ్, బ్యాక్ టు రియాలిటీ: నాగార్జున
అక్కినేని ఫ్యామిలీ మొత్తం హాలిడే ఎంజాయ్ చేయడానికి వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. నాగార్జున, అమల, నాగ చైతన్య, సమంత, అఖిల్ స్పెయిన్ దేశంలోని ఇబిజా ఐలాండ్‌లో పర్యటించారు. హాలిడే ముగియడంతో నాగార్జున ట్విట్ చేశారు. డ్రీమ్ హాలిడే ముగిసింది. బ్యాక్ టు లైఫ్, బ్యాక్ టు రియాలిటీ అంటూ అని వ్యాఖ్యానించారు.
నాగ చైతన్య, సమంత వివాహం జరిగి ఈ అక్టోబర్ 6తో సరిగ్గా సంవత్సరం పూర్తవుతుంది. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సీని రోటీన్‌గా కాకుండా డిఫరెంటుగా ప్లాన్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ ముందు ఫ్యామిలీ మొత్తం వెకేషన్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అందరి కంటే ముందుగా సమంత, నాగ చైతన్య వెళ్లగా.... 'దేవదాస్' మూవీ ప్రమోషన్స్ పూర్తి చేసుకుని నాగార్జున, అమల ఈ వెకేషన్లో జాయిన్ అయ్యారు.
కేవలం అక్కినేని ఫ్యామిలీ మాత్రమే కాదు... వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్, కొందరు సన్నిహితుల కూడా హాలిడే ట్రిప్‌లో భాగమయ్యారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో హాలిడే మరింత మజాగా ఉంటుందంటూ నాగార్జున ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

నాగార్జున సినిమాల విషయానికొస్తే... నాగార్జున-నాని కలిసి నటించిన దేవదాస్ ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం ఆయన మలయాళంలో మోహన్ లాల్ మూవీలో, హిందీలో బ్రహ్మాస్త్ర, తమిళంలో ధనుష్ సినిమాకు కమిట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











