పాన్ ఇండియా పదం వింటే విసుగొస్తుంది.. నేను యాక్టర్ కాకపోతే.. దుల్కర్ సల్మాన్
పాన్ ఇండియా అనే ట్యాగ్ విని విని విసుగొచ్చింది. ఆ పదం వాడకుండా ఒక ఆర్టికల్ కూడా ఉండటం లేదు. నిజానికి పాన్ ఇండియా కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్.. ఇలా ఎంతో మంది సినిమాలు దేశ విదేశాలు దాటి ఆడాయి. ఇప్పుడు ప్రత్యేకంగా పాన్ ఇండియా ఫిల్మ్ అని ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదని నా ఫీలింగ్. సినిమాను సినిమాగానే చెబితే చాలు అని దుల్కర్ సల్మాన్ అన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ నటించిన సీతారామం ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ..
ఇది నాకు కూడ ఆందోళనకరమైన ఆలోచనే (నవ్వుతూ) బిజినెస్ స్కూల్ లో చదువుకున్నాను. ఎంబీఎ చేశాను. బహుశా ఇన్వెస్టర్ ని అయ్యేవాడినేమో.
నాన్న గారు నాకు ఆదర్శం. ఆయన గర్వపడేలా చేయడమే నా కర్తవ్యం. సినిమాలు, కథలు గురించి ఇంట్లో మాట్లాడుతుంటాం. నేను నా కథలని సింగిల్ లైన్ లో చెబుతుంటాను. నాన్న గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనే నా హీరో.

నటుడిగా రాణిస్తూనే, నిర్మాతగా, డిస్టిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నాను. సింగర్ అంటే నేను ఒప్పుకోను. సింగర్‌గా నాకు అంత టాలెంట్ లేదు. డైరెక్షన్ చేయడానికి ఇప్పుడంత సమయం లేదు. నా దర్శకత్వంలో సినిమా వస్తే మాత్రం అది ప్రేక్షకుల ఊహకు భిన్నంగా ఉంటుంది. దాని కంటే ముందు షార్ట్ ఫిలింస్ డైరెక్షన్ చేస్తుంటాను. ఇంటిలో నాన్న చాలా ఖరీదైన కెమెరాలు తెచ్చి పెట్టారు. వాటితో షార్ట్ ఫిలింస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను.
సీతారామం సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాపై అభిప్రాయాలు మారిపోయాయి. ఈ కథను చాలా రకరకాలుగా ఊహించుకొంటున్నారు. రష్మిక నా కూతురు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఎలా ఊహించుకొన్నా.. అందరి ఊహలకు భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నాపై కురిపించిన ప్రేమ గురించి మాటల్లో చెప్పలేను అని దుల్కర్ సల్మాన్ అన్నారు. విజయవాడ, వైజాగ్‌లో పొందిన అనుభూతి ఓ వరం లాంటింది. కొచ్చిలో ఇలాంటి స్పందన ఉంటుంది. కానీ వైజాగ్ టూర్ ఓ జాయ్ రైడ్‌గా ఉంది అని దుల్కర్ సల్మాన్ చెప్పారు.


Click it and Unblock the Notifications











