Dulquer Salmaan: సీతారామం హీరోకు ఊహించని అనుభవం.. అక్కడ రుద్దిన మహిళ
తెలుగు చిత్ర పరిశ్రమలో అందమైన ప్రేమ కావ్యాలకు పెట్టింది పేరు హను రాఘవపూడి. ఎమోషనల్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తెరెక్కించే ఆయన ఇటీవల సీతా రామం సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో హను రాఘవపూడి మార్క్ మరోసారి ప్రూవ్ అయింది. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు దుల్కర్ సల్మాన్. డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించిన దుల్కర్ సల్మాన్ సీతా రామం మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే అతనికి ఓసారి వింత అనుభవం ఎదురైనట్లుగా తెలిపాడు.
మెగాస్టార్ కొడుకుగా : మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కుమారుడిగా మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). డైరెక్టర్ శ్యాం ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన రీతూ అనే సినిమాలో ఓ పాత్రతో ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ తర్వాత కొంతకాలం పాటు సినిమాలపై కోర్స్ చేశాడు. అనంతరం 2011లో మళ్లీ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.

సూపర్ హిట్ : దుల్కర్ ఫ్రెండ్ శ్రీనాథ్ రాజేంద్రన్ తెరకెక్కించిన తొలి సినిమా సెకండ్ షోలో నటించేందుకు ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించిన దుల్కర్ సల్మాన్ నటుడిగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకోవడంతోపాటు సూపర్ హిట్ అయింది. తర్వాత ఉస్తాద్ హోటల్, అందమైన జీవితం, చార్లీ, కురుప్ సినిమాలతో ఆకట్టుకున్నాడు.

తిరుగులేని విజయం : దుల్కర్ సల్మాన్ ఓకే బంగారం అనే మలయాళ డబ్బింగ్ సినిమాతో తెలుగు చిత్రీసమకు పరిచయం అయ్యాడు. అనంతరం మహానటి సినిమాలో కీలకపాత్ర పోషించి నటుడిగా సత్తా చాటాడు. అప్పటి నుంచి దుల్కర్ సినమాలు తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి. అందులో కనులు కనులు దోచాయంటే సినిమాకు మంచి పేరు వచ్చింది. ఇక సీతారామం మూవీతో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు దుల్కర్.

ఓటీటీలోనూ : ప్రస్తుతం దుల్కర్ వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు. ఇటీవలే చుప్ మూవీతో నెగెటివ్ రోల్ కి అవార్డ్స్ అందుకున్న దుల్కర్ ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోతా (King Of Kotha) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ఆగస్ట్ 24న థియేటర్లలో విడుదల కానుంది. దీనికంటే ముందుగానే ఓటీటీలో ప్రేక్షకులను పలకరించాడు దుల్కర్ సల్మాన్.

ఆగస్ట్ 18 నుంచి : దుల్కర్ సల్మాన్ తాజాగా నటించిన ఓటీటీ వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ (Guns & Gulaabs). ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వెబ్ సిరీసుల డైరెక్టర్స్ రాజ్ డీకే తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 18 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో దుల్కర్ తోపాటు రాజ్ కుమార్ రావు, గుల్షన్ దేవయ్య, ఆదర్శ్ గౌరవ్, పూజా గోర్ కీలక పాత్రలు పోషించారు.

చాలా నొప్పిగా : ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోతా ప్రమోషన్లతో బిజీగా ఉన్న దుల్కర్ సల్మాన్ తనకు జరిగిన వింత అనుభవం చెప్పుకొచ్చాడు. "సాధారణంగా అభిమానులు సెలబ్రిటీలకు హానీ కలిగించాలని అనుకోరు. కానీ, కొన్నిసార్లు ఉత్సాహంతో విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఓ సంఘటన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఓ మహిళ నా కాళ్లపై చేతులతో రుద్దింది. అప్పుడు నాకు చాలా నొప్పిగా అనిపించింది. ఆమె వయసులో నాకన్న చాలా పెద్దది. ఆమె అలా ఎందుకు చేసిందో అర్థం కాలేదు. అక్కడ వేదికపై చాలా మంది ఉన్నారు" అని దుల్కర్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











