Remuneration: లక్కీ భాస్కర్ మూవీకి దుల్కర్ టాప్ రెమ్యునరేషన్.. పారితోషికం ఎన్ని కోట్లంటే?
మాములుగా పండుగ సీజన్ అంటే వరుస సినిమాలు మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే హంగామా వేరే లెవెల్లో ఉంటుంది. అలా ఎప్పటిలానే ఈ ఏడాదిలో కూడా పండుగలకు చాలా సినిమాలే వచ్చేసాయి. ఇది సంక్రాంతి సినిమా నుంచే స్టార్ట్ కాగా సంక్రాంతిలో వచ్చిన పలు సినిమాల్లో ఒకటి తప్ప అన్నీ బాగానే వసూళ్లు అందుకొని అదరగోట్టాయి. ఇక ఈ తర్వాత నుంచి ఉగాది, జనవరి 26 అలాగే శివరాత్రి అంటూ చాలా సినిమాలు వస్తూనే వచ్చాయి.
అలాగే మొన్న ఆగష్టు 15 కి కూడా పలు సినిమాలు వచ్చాయి. కానీ సంక్రాంతికి వచ్చిన మాదిరిగా ఏ పండుగ సినిమాలు కూడా అంత ఎఫెక్ట్ చూపించలేదు. కాగా అక్కడ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ కళ్ళల్లో ఆనందపు వెలుగులు నింపిన పండుగ ఏది అంటే అది ఈ దీపావళి చెప్పొచ్చు. చిన్న సినిమాలే అయినప్పటికీ మోత్తం అన్ని సినిమాలూ మంచి పోటీ నడుమ రిలీజ్ కి వచ్చాయి.

కాగా ఈ సినిమాలో తెలుగు సూపర్ హిట్ సినిమా నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం "లక్కీ భాస్కర్" కూడా దుల్కర్ తెలుగులో చేసిన మూడో సినిమా ఇది కాగా తనకి ఇది కూడా మంచి హిట్ అందుకునేలా చేసింది. అయితే దుల్కర్ కి మలయాళం సహా తెలుగులో కూడా మంచి మార్కెట్ వచ్చేసింది. పైగా వరుస హిట్స్ ఇస్తుండడంతో దుల్కర్ కూడా తన రెమ్యునరేషన్ ని పెంచినట్టుగా టాక్ వినిపిస్తుంది.
కాగా దుల్కర్ తెలుగు సహా మలయాళ సినిమా దగ్గర 8 నుంచి 10 కోట్ల మేర ఒకో సినిమాకి ఛార్జ్ చేసేవాడట. ఇప్పుడు మరిన్ని హిట్స్ అందుకోవడంతో తన పెంచేసినట్టుగా తెలుస్తుంది. కాగా ముందు 8 నుంచి 10 కోట్ల శాలరీ అందుకునే దుల్కర్ ఇపుడు ఏకంగా దీనిని 10 నుంచి 12 కోట్లు చేసాడట. సినిమా బడ్జెట్, కథలని బట్టి దుల్కర్ ఈ రెండు ఫిగర్స్ లో సినిమాలు ఒప్పుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఇంట్రెస్టింగ్ గా లక్కీ భాస్కర్ సినిమా కూడా తనపై డబ్బు చుట్టూతానే తిరుగుతుంది. అందులో కూడా బాగా సంపాదించి ఎలా అయితే హిట్ అయ్యాడో నిజ జీవితంలో కూడా ఇదే లక్కీ భాస్కర్ ఎఫెక్ట్ తో తన రెమ్యునరేషన్ ని పెంచుకున్న వాడిగా నిలిచాడు అని చెప్పాలి. కాగా ఇపుడు తెలుగులోనే మరో రెండు సినిమాలు దుల్కర్ చేస్తుండగా ఇవే కాకుండా మలయాళంలో కూడా పలు సినిమాలు చేస్తున్నాడు.
అలాగే సినిమాలు మాత్రమే కాకుండా దుల్కర్ వెబ్ సిరీస్ కూడా చేసిన సంగతి తెలిసిందే. అలా ఇపుడు దుల్కర్ ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పాలి. ఇక తన లక్కీ భాస్కర్ సినిమాని తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించగా నాగవంశీ, త్రివిక్రమ్ లు నిర్మాణం వహించారు. అలాగే ఇపుడు సినిమా 50 కోట్లకి పైగా గ్రాస్ ని దాటి మరింత బెటర్ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఇలా మొత్తంగా అయితే చిత్ర యూనిట్ అంతా లక్కీ భాస్కర్ హిట్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











