మూడేళ్ల తర్వాత హారర్ చిత్రంలో సీరియల్ కిస్సర్.. మలయాళం రీమేక్‌లో
గతంలో హారర్ చిత్రాలతో అలరించిన సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. చాలాకాలం తర్వాత ఇమ్రాన్ హష్మీ హారర్, థ్రిల్లర్ చిత్రంలో నటించనున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ఇజ్రా సినిమా హిందీ రీమేక్‌లో కనిపించనున్నారు. గతంలో హష్మీ నటించిన రాజ్ రీబూట్, ఏక్ థి దయాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసులు పంట పడించిన సంగతి తెలిసిందే.
మూడు సంవత్సరాల తర్వాత ఇమ్రాన్ హష్మీ ఇజ్రా రీమేక్‌లో నటిస్తున్నాడు. పనోరమ స్టూడియోస్ బ్యానర్‌పై కుమార్ మంగత్ పాథక్, అభిషేక్ పాథక్ నిర్మాతలుగా రూపొందిస్తున్నారు. మలయాళంలో దర్శకత్వం వహించిన జయకృష్ణన్ ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తాడు. ఈ చిత్రం షూటింగ్ ముంబై, మారిషస్‌లో జరుగుతున్నది. ఇంకా హీరోయిన్, ఇతర నటీనటులు ఎంపిక పూర్తి కాలేదు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ప్రేక్షకులను రంజిప చేసే హారర్ అంశాలు ఉన్న చిత్రం ఇజ్రా. ప్రేక్షకులను సినిమా హాళ్లకు రప్పించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి అని హీరో ఇమ్రాన్ హష్మీ తెలిపారు. ఇటీవల ఇమ్రాన్ నటించిన బాద్షాహో, వై చీట్ ఇండియా చిత్రాలు మంచి విజయం సాధించాయి.


Click it and Unblock the Notifications











