twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ ఫిట్‌నెస్ చూస్తే ఫిదా.. సిక్స్ ప్యాక్‌తో ఎనర్జిటిక్ స్టార్ రచ్చ

    |

    ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. అప్పటి వరకు చాక్లెట్ బాయ్‌లా ప్రేమకథల్లో నటించే రామ్‌‌కు సిక్స్ ప్యాక్ పెంచే అవసరమే రాలేదు. కానీ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాద్ చేతిలో పడితే హీరోల స్వరూపమే మారిపోతుందన్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో చాక్లెట్ బాయ్‌లా ఉన్న రామ్‌ను గల్లీ పోరడిలా తయారుచేసేశాడు. బాడీ లాంగ్వేజ్, లుక్స్, యాస అన్నింటిని మార్చేసి మాస్‌కు దగ్గర చేసేశాడు.

    ఇస్టార్ట్ శంకర్ సినిమా సక్సెస్ కావడానికి రామ్ లుక్ కూడా ఓ కారణం. అప్పటి వరకు ఒకేలా కనిపించిన రామ్.. ఇస్మార్ట్‌లో పూర్తి భిన్నంగా కనిపించి మెప్పించాడు. తదుపరి చేయబోయే సినిమాలోనూ రామ్ భిన్నంగానే కనిపించనున్నాడు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్, టీజర్ ఓ రేంజ్‌లో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓ పుకారు కూడా వస్తే.. రామ్ స్వయంగా ఖండించాడు.

    Energetic Star Ram Shares A Wonderful Pic With Six Packs

    రామ్ నటిస్తున్న RED చిత్రానికి అమెజాన్ వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో మంచి ధర వచ్చిందని అందులో రిలీజ్ చేద్దామా? వద్దా? అనే డైలామాలో ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి. తాజాగా రామ్ వాటిపై స్పందిస్తూ.. నేను ఎలాంటి డైలామాలో లేనంటూ రూమర్స్‌కు చెక్ పెట్టేశాడు. తాజాగా రామ్ షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. సిక్స్ ప్యాక్‌తో పాటు ఫోటోలో ఉన్న విజువల్ అందర్నీ కట్టిపడేస్తోంది. దీంతో పాటు రామ్ చేసిన కామెంట్ కూడా వైరల్ అవుతోంది.

    English summary
    Energetic Star Ram Shares A Wonderful Pic With Six Packs. He Says That Me with my favourite-nature... #throwbackthursday ..wait...is it Thursday?.....What year is it?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X