twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR బాలకృష్ణను చూసి తన్నితే సీటు విరిగి ముక్కలైంది.. ఆ విషయంలో చావడానికైనా సిద్ధం.. ఎన్టీఆర్ ఎమోషనల్

    |

    యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తున్నది. అక్టోబర్ 19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో రాజమండ్రికి చెందిన సురేంద్రనాథ్ హాట్ సీట్ మీదకు వచ్చి గేమ్‌ను ఎన్టీఆర్‌తో కొనసాగించారు. ఈ షోలో మంగళవారం ఆయన రూ.640000 గెలుచుకొని కోటి రూపాయలపై దృష్టిపెట్టారు. మంగళవారం సమయం ముగియడంతో బుధవారం రోజున రోల్ ఓవర్ కంటెస్ట్‌గా ఆడబోతున్నారు. ఈ షోలో ఎన్టీఆర్, సురేంద్రనాథ్ మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ ఎలా కొనసాగిందంటే...

    ఎన్టీఆర్ చదివిన స్కూల్‌లోనే

    ఎన్టీఆర్ చదివిన స్కూల్‌లోనే

    సురేంద్రనాథ్ వెంట తండ్రి వెంగయ్య, కూతురు హర్షిణి ఎవరు మీలో షోలో పాల్గొన్నారు. విజ్ఞాన్ స్కూల్‌లో హర్షిణి ఎనిమిదో తరగతి చదువుకొంటున్నారు. అదే స్కూల్‌లో ఎన్టీఆర్ కూడా చదువుకొన్నారు. అదే విషయాన్ని హర్షిణి గుర్తు చేశారు. మా స్కూల్‌లో చదువుకొన్న ప్రముఖుల ఫోటోలు పెట్టారు. అందులో మీ ఫోటో కూడా ఉంది. ఇంకా చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్‌ల ఫోటోలకు కూడా ఉంటాయి. మీ అందరి మాదిరిగానే మేము ఎదగాలని స్పూర్తి పొందుతున్నాం అని హర్షిణి చెప్పారు.

    బాబాయ్ సినిమా చూసి జోష్‌లో తన్నితే

    బాబాయ్ సినిమా చూసి జోష్‌లో తన్నితే

    ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్‌లో భాగంగా సురేంద్రనాథ్‌కు బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు చిత్రంలోని లక్స్ పాప లక్స్ పాపను వినిపించారు. ఈ పాట ఏ చిత్రంలోనిది అని అడిగితే.. కరెక్ట్‌గా చెప్పారు. అయితే ఈ సినిమా గురించి ఎన్టీఆర్ గురించి చెబుతూ.. బీ గోపాల్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించారు. నా జీవితంలో మరిచిపోలేనటువంటి సినిమా. ఊర్వశి థియేటర్‌లో సినిమా చూశాను.

    ఆ సినిమా చూసిన తర్వాత జోష్‌ను ఆపుకోలేక ముందు ఉన్న సీటును తన్నితే విరిగిపోయింది అంటూ ఎన్టీఆర్ తన అనుభూతులను పంచుకొన్నారు. మీరు మీ జీవితంలో లక్స్ పాప అంటూ ఎవరి కోసమైనా పాట పాడారా అంటే అలాంటిదేమీ లేదు అని సురేంద్రనాథ్ చెప్పారు.

    నా గురువు సుధాకర్ గారికి ప్రణామం

    నా గురువు సుధాకర్ గారికి ప్రణామం

    ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యుహు గురించి తడుముకోకుండా సమాధానం చెప్పడంతో ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. ఎంబీఏ ఫైనాన్స్ చేసి ఇజ్రాయెల్ గురించి కూడా మంచి అవగాహన మీకు ఉంది అంటే.. సురేంద్ర నాథ్ స్పందిస్తూ.. నేను జాబ్‌లో చేరే సమయానికి స్టూడెంట్ నంబర్ 1 సినిమా రిలీజ్ అయింది.

    మీరు ఆ సినిమాలో డ్యాన్స్ బాగా చేశారు. నేను మీకు ఫ్యాన్ అని సురేంద్రనాథ్ అంటే.. నేను బేసిక్‌గా కూచిపూడి డ్యాన్సర్‌ను. మా గురువు సుధాకర్ గారు నేర్పించారు. ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆయనను కలుసుకోవడానికి వీలు కావడం లేదు. ఎలాగైనా కలుసుకోవాలి. సుధాకర్ గారికి ఈ సందర్భంగా ప్రణామం అంటూ ఎన్టీఆర్ దండం పెట్టారు.

     నటన కోసం చావడానికైనా సిద్ధం అంటూ

    నటన కోసం చావడానికైనా సిద్ధం అంటూ

    నటుడిగా మీరు ఎలా ట్రాన్స్‌ఫార్మ్, విభిన్నమైన పాత్రలను ఎలా పోషిస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం ఎన్టీఆర్ ఇస్తూ.. మీరు ఎంబీఏ చదువుకొన్నారు. ఇజ్రాయెల్ గురించి కూడా బాగా తెలుసుకొన్నారు. ఏదైనా విషయంపై ఇంట్రెస్ట్ ఉంటే అదే మనల్ని అంకితభావంతో పనిచేయిస్తుంది. నేను ఏం చదువుకొన్నా నాకు నటన మాత్రం తెలుసు. నటనే నా జీవితం. చిన్పప్పటి నుంచి తాతగారు, నాన్నగారు నాకు స్పూర్తి. నటుడు కావాలని చిన్పప్పటి నుంచి డ్రీమ్.

    నేను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాను. నాకు రకరకాల నాలెడ్జ్ చాలా ఉంది. కానీ నేను ఫోకస్ చేసేంది నటనపైనే. నటనకు కోసం ఏదైనా.. చచ్చిపోవడానికైనా సిద్ధం అంటూ ఎన్టీఆర్ అన్నారు. ఇంత మంది ప్రేక్షకులను రంజింప చేసే అదృష్టం ఎవరికి ఉంటుంది చెప్పమని ఎమోషనల్ అయ్యారు.

    మనకు సిగ్గుండాలి అంటూ..

    మనకు సిగ్గుండాలి అంటూ..

    గేమ్‌లో భాగంగా 1+41 కవితా సంపుటి గబ్బిలం రచయిత ఎవరు? అని అడిగితే.. ఆయన లైఫ్‌లైన్ తీసుకొన్నారు. అయితే ఆ ప్రశ్నకు సురేంద్రనాథ్ కూతురు హర్షిణి ముందే సమాధానం చెప్పడంతో ఎన్టీఆర్ ఆశ్చర్య పోయారు. మీకు ఈ ప్రశ్నకు సమాధానం ఎలా తెలుసు అంటే.. మా తెలుగు టీచర్ రచయితలు, ప్రముఖుల గురించి బాగా చెబుతారు.

    ఎనిమిదో తరగతిలో గుర్రం జాషువా గురించి పాఠం ఉంది. ఆమె చాలా డీటైల్‌గా చెబుతారు అనగానే ఎన్టీఆర్ ఎమోషన్ అయ్యారు. మీకు గుర్రం జాషువా గురించి ముందే తెలుసు అన్నమాట.. మనకు సిగ్గుండాలి? ఎంబీఏ ఫైనాన్స్ చదువుకొని ఏ లాభం అని ఎన్టీఆర్ అనగానే.. సురేంద్రనాథ్‌తోపాటు అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

    Recommended Video

    Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
    విజ్ఞాన్ టీచర్‌కు దండాలు పెట్టిన ఎన్టీఆర్

    విజ్ఞాన్ టీచర్‌కు దండాలు పెట్టిన ఎన్టీఆర్

    గుర్రం జాషువా గురించి మీకు ఎలా గుర్తుంది అంటే.. మా రాజ్యలక్ష్మీ టీచర్ మాకు చాలా బాగా చెప్పారు. ఆమె చాలా చక్కగా వివరంగా చెబుతారు అని హర్షిణి చెబితే.. ఇంత బాగా చెప్పిన రాజ్యలక్ష్మికి ధన్యవాదాలు. ఇలాంటి స్కూల్స్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ఎన్టీఆర్ చేతులెత్తి మొక్కారు. ఇలా ఎమోషనల్‌గా ఎపిసోడ్ ముగిసింది.

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show October 19th Episode: NTR about Nandamuri Balakrishna and Narasimha Naidu movie in Evaru Meelo Koteeswarulu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X